బాబుకు ఇండియా కూటమి సపోర్ట్..సీన్ రివర్స్.!

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇండియా కూటమి నేతలు మద్ధతు తెలుపుతున్నారు. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడంతో..జాతీయ స్థాయిలో పలువురు కీలక నేతలు బాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమతా బెనర్జీ..బాబు అరెస్ట్ అక్రమంటూ గళం విప్పారు. ఇదే సమయంలో ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు సైతం బాబు అరెస్ట్‌ని ఖండించి..టి‌డి‌పికి మద్ధతుగా నిలిచాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సి‌ఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్..చంద్రబాబుకు మద్ధతు తెలిపారు.  చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారిందని,  అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని.. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ, వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

SP Chief

అంటే డైరక్ట్ గా బి‌జే‌పితో పాటు..బి‌జే‌పికి అనుకూలంగా ఉంటున్న జగన్‌కు అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇలా ఇండియా కూటమి నేతలు బాబుకు మద్ధతు తెలుపుతున్నారు. కానీ బాబు ఏమో బి‌జే‌పికి దగ్గరవ్వాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు దక్కితే..ఏపీలో రాజకీయంగా తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బాబు భావిస్తున్నారు.

కానీ బి‌జే‌పి మాత్రం బాబుకు సపోర్ట్ ఇవ్వడం లేదు. పరోక్షంగా జగన్‌కు మద్ధతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకొచ్చాక బాబు రాజకీయం ఎలా ఉంటుందనేది చూడాలి. మరి బాబు ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news