టీడీపీ-జనసేన పార్టీల పొత్తుల గురించి రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..గత ఏడాది నుంచి రెండు పార్టీల పొత్తుపై ప్రచారం నడుస్తోంది..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని విశ్లేషణలు వచ్చాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తుపై పరోక్షంగా ఓకే కూడా చెప్పుకున్నారు…వైసీపీని అంతం చేయడానికి విపక్షాల సపోర్ట్ కావాలని బాబు…వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వనని పవన్ అన్నారు. అలాగే పొత్తులపై మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారు.
అయితే ఈ సారి టీడీపీ తగ్గాలని పవన్ సూచించారు…అలాగే పవన్ కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా సీఎం సీటు గురించి మాట్లాడతుండటంతో టీడీపీ శ్రేణులు రివర్స్ అయ్యాయి..తాము ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని, వార్ వన్ సైడ్ అయిందని చంద్రబాబు కూడా మాట్లాడారు. ఇక దీనికి కౌంటర్ గా పవన్..తమకు ఎవరితో పొత్తు ఉండదని, ప్రజలతోనే పొత్తు అని అన్నారు. ఇక అక్కడితో టీడీపీ-జనసేన పొత్తు గురించి చర్చ ఆగిపోయింది.
ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా బలం పెంచుకునే కార్యక్రమాల్లో ఉన్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే పొత్తు విషయంలో పట్టించుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య వరుసపెట్టి పలు అసెంబ్లీ సీట్లలో అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో పలు సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు..అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని సీట్లని ఫిక్స్ చేశారు. పలాసలో గౌతు శిరీష, ఆమదాలవలసలో కూన రవికుమార్ పోటీ చేస్తారని చెప్పారు.
అలాగే ఈ మధ్య చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళి…పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరులో చల్లా బాబు, నగరిలో గాలి భాను ప్రకాశ్, రాజంపేట ఎంపీగా గంటా నరహరికి ఫిక్స్ చేశారు. అటు మదనపల్లె సీటు దొమ్మాలపాటి రమేష్ కు ఫిక్స్ చేశారు…ఇంకా పలు సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే పొత్తు ఉంటే మదనపల్లె, రైల్వేకోడూరు సీట్లని అడగాలని జనసేన చూస్తుంది…కానీ పవన్ ఎప్పుడైతే పొత్తు లేదనే చెప్పారో…అప్పటినుంచి బాబు తమ అభ్యర్ధులని ప్రకటించుకుంటూ వెళుతున్నారు. అంటే పొత్తు లేదని పవన్ చెప్పిన మాటని బాబు నిలబెడుతున్నట్లున్నారు.