రూ.40వేల కోట్లతో పట్టణ పేదలకు 10లక్షల ఇళ్ల నిర్మాణం : చంద్రబాబు

-

  • మన సమాజానికి అతి పెద్ద సంపద
  •  పట్టణ గృహ నిర్మాణంపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Takes Key Decisions In AP Cabinet Meeting
‘‘దేశానికే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పట్టణ గృహ నిర్మాణ(అర్బన్ హవుసింగ్) కార్యక్రమం. లక్షలాది పేద కుటుంబాల కలల ప్రాజెక్టు. ఏపిలో రూ.39,427కోట్లతో 9,58,230ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం.ఇందులో కేంద్రం వాటా రూ.7,946కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.13,481కోట్లు. కేంద్ర,రాష్ట్రాల వాటా కింద ఇప్పటివరకు రూ.5,804కోట్లు విడుదల చేశాం.ఈ ప్రాజెక్టు సమాజానికి అతిపెద్ద సంపద అవుతుంది’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేయాలి.దేశంలోనే బెస్ట్ ఏజెన్సీలను గుర్తించాం. రెండు,మూడు స్థాయిలలో క్వాలిటి కంట్రోల్ చేస్తున్నాం.
పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ లు (ఏహెచ్ పి) కింద మంజూరైన ఇళ్లు 5,29,786 కాగా అందులో గ్రవుండ్ అయినవి 3,29,217. వాటిలో 98,705ఇళ్లకు శ్లాబులు పడ్డాయి. ఎన్టీఆర్ అర్బన్ హవుసింగ్(బిఎల్ సి) కింద మంజూరు అయ్యింది 4,28,444కాగా,అందులో గ్రవుండ్ అయ్యింది 1,01,426. వాటిలో ఇప్పటివరకు 56,800ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది.

నవంబర్ 15లోపు లబ్దిదారుల ఎంపిక, నవంబర్ 30కల్లా గ్రవుండింగ్:
నవంబర్ 15లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి. ఆన్ లైన్ లాటరీ నవంబర్ 22కల్లా పూర్తిచేయాలి.మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు నవంబర్ 30కల్లా ముమ్మరం కావాలి. లబ్దిదారుల ఎంపిక బాధ్యత జిల్లా ఎంపిక కమిటీ, ఎమ్మెల్యేలదే. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలి.ఆన్ లైన్ లో అన్నివివరాలు నమోదు చేయాలి. లాటరీ ద్వారా ఎంపిక చేయాలి. మీడియా సమక్షంలో పారదర్శకంగా చేయాలి. ఎటువంటి లోపాలు ఉత్పన్నం కారాదు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టు ప్రారంభంలో ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంలో చూపడం లేదు. రెవిన్యూ,మున్సిపల్ అధికారులు సమన్వయంగా పనిచేయాలి. ఎందులోనూ రాజీపడే ప్రసక్తే లేదు. రోడ్లు,విద్యుత్, తాగునీరు, డ్రైనేజి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. వీధి దీపాల ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపొందించాలి. ఇప్పటినుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తాను.

పట్టణాలలో డిసెంబర్ 15న ‘‘లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు’’
డిసెంబర్ 15న ‘‘లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు’’ వేడుకగా జరపాలి.మన ఇళ్ల నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనా. 7రాష్ట్రాల ప్రతినిధి బృందాలు చూసి ప్రశంసించాయి. ఇళ్లు చూడగానే ఆహ్లాదంగా ఉండాలి. యజమాని దగ్గరుండి ఇంటి పనులు చూసుకోవాలి. ఇంటితో అనుబంధం పెంచుకునేలా చేయాలి. ఈ రోడ్లు ఎప్పుడు వేశారు,ఆ పార్కు ఎప్పుడు అభివృద్ధి చేశారు, వీధి దీపాలు ఎప్పుడు పెట్టారు అనే భావన ప్రజల్లో రావాలి. మొత్తం ప్రాజెక్టు వివరాలను ఆన్ లైన్ లో ఉంచాలి.

‘‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’’ తరహాలో పట్టణ పేదల ఇళ్లు
‘‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’’ తరహాలో ఇళ్లు నిర్మిస్తున్నాం. ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. ఇళ్లకు దగ్గరలోనే ఆర్ధిక కార్యకలాపాలు(ఎకనామిక్ యాక్టివిటీస్) పెంచుతున్నాం.
ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు డా.పి. నారాయణ, శ్రీ కాలువ శ్రీనివాసులు, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్ ఎల్ బిసి కన్వీనర్, ఎమ్మెల్యేలు,మున్సిపల్ కమిషనర్లు,బ్యాంకర్లు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news