2023లోనే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడుతుందా? అరెస్ట్ తో ఆయన పోలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా? అంటే వైసీపీ నేతలు అదే అంటున్నారు. ఇంకా బాబు కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే అని చెబుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.
ఇక బాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు వద్ద దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుండగా, వైసీపీ శ్రేణులు ఏమో సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇదే ఇంకా బాబు రాజకీయానికి చివరి రోజులు అని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు 2023 రాజకీయంగా చివరి సంవత్సరం అంటూ పేర్కొన్నారు. దీనికి కారణాన్ని కూడా ట్విటర్‌లో విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. ఈ నెంబర్ ఆధారంగా చంద్రబాబు రాజకీయ జీవితానికి ఇదే చివరి సంవత్సరం అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691… 7+6+9+1 = 23 వస్తుందని, చంద్రబాబు.. మీకు 2023 చివరి సంవత్సరం. 2024 సంవత్సరం నుంచి రాజకీయ యవనికపై ఇక మీరు కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు. అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చూడాలి మరి సాయిరెడ్డి చెప్పినట్లు 2023 లోనే బాబు పోలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డు పడుతుందేమో.