లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు.. ఇదే కీలక సమయమా? చంద్రబాబు ఆలోచనేంటి?

-

చంద్రబాబు వయసు 69 కి చేరింది. వచ్చే ఎన్నికల నాటికి 74 దాకా అవుతుంది. అప్పటికి తన ఆరోగ్యం సహకరించకపోతే ఎట్లా? లోకేశ్ భవిష్యత్తు ఎట్లా? తనకు చేతకాకపోతే టీడీపీని నడిపించేది ఎవరు? లోకేశ్ కు ఇంకెప్పుడు కీలక బాధ్యతలు అప్పగించాలి.. అంటూ చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయట.

వైఎస్ఆర్ కొడుకు జగన్ సీఎం అయ్యారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అందులోనూ వాళ్లిద్దరూ కష్టపడి పైకొచ్చారు. తమ తమ పార్టీలో కిందిస్థాయి నుంచి పైకి వచ్చారు. ప్రజలతో కూడా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు తమ తండ్రులతో సమానంగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.

మరి.. వాట్ ఎబౌట్ చంద్రబాబు సన్ లోకేశ్ బాబు. ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ దేశంలో నాకన్నా సీనియర్ రాజకీయ నాయకుడు లేడని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు.. తన కొడుకు రాజకీయాల్లో రాణించేలా చర్యలు తీసుకోలేకపోతున్నారా? అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? నారా లోకేశ్ ను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు. చంద్రబాబు.. లోకేశుడిని ఎంత పైకి తీసుకొద్దామనుకున్నా… ఆయన అంత కిందికి జారిపోతున్నారు. తన ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. మరి.. ఇప్పటి సంగతి ఏంటి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. పవర్ లేదు. అందుకే.. లోకేశ్ బాబు కేవలం ఎమ్మెల్సీగా మిగిలిపోయారు. కానీ.. అది సరిపోద్దా? సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి కొడుకుకు ఎమ్మెల్సీగానే ఉండిపోవాలా? వైఎస్సార్ కొడుకు ముఖ్యమంత్రి అయినప్పుడు.. కేసీఆర్ కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు.. నా కొడుకుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే తప్పేంటి… అని ఆలోచిస్తున్నారట చంద్రబాబు.

అందులోనూ చంద్రబాబు వయసు 69 కి చేరింది. వచ్చే ఎన్నికల నాటికి 74 దాకా అవుతుంది. అప్పటికి తన ఆరోగ్యం సహకరించకపోతే ఎట్లా? లోకేశ్ భవిష్యత్తు ఎట్లా? తనకు చేతకాకపోతే టీడీపీని నడిపించేది ఎవరు? లోకేశ్ కు ఇంకెప్పుడు కీలక బాధ్యతలు అప్పగించాలి.. అంటూ చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయట.

దీంతో ఎలాగైనా లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట. అయితే.. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తోందట. లోకేశ్ తీరుపై మొదటి నుంచీ పార్టీలో అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

అయినప్పటికీ.. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుందని లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఆయన సన్నిహితులు కూడా ఇదే సరైన సమయమని.. లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబుకు ఒత్తిడి తెస్తున్నారట. దీంతో ఎలాగైనా లోకేశ్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి… పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను కూడా బుజ్జగించే కార్యక్రమం పెట్టుకున్నారట చంద్రబాబు. అంటే త్వరలోనే లోకేశ్ బాబుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టనున్నారన్నమాట. మరి.. దానికి ముహూర్తం ఎప్పుడో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news