చంద్ర‌బాబు చేస్తున్న డిమాండ్ రివ‌ర్స్ అవుతోందే.. విమ‌ర్శ‌లు త‌ప్ప‌ట్లేదే..

చంద్రబాబు నాయుడు అంటే రాజ‌కీయంలో అప‌ర‌ చాణ‌క్యుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న ప్లాన్ వేస్తే దానికి తిరుగు ఉండ‌ద‌నే చెప్పాలి. ఒక‌ప్పుడు ఆయ‌న త‌న వ్యూహాల‌తోనే ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్టేవారు. ఆయ‌న ఏ ప‌ని చేసినా కూడా చాలా ముందు జాగ్ర‌త్త‌తో ఇంకా చెప్పాలంటే భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో త‌న‌కు ల‌బ్ధి చేకూరే విధంగా చూసుకుంటార‌నే టాక్ ఉండేది. అదేంటో కానీ ఆయ‌న ఇప్పుడు విమ‌ర్శ చేసినా తిరిగి ఆయ‌న మెడ‌కే చుట్టుకుంటోంది. ఒక స‌మ‌స్య‌పై మాట్లాడినా చివ‌ర‌కు ఆయ‌న‌పైనే విమ‌ర్శ‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

CBN
CBN

ఇక ఇలాగే ఇప్పుడు మ‌రో డిమాండ్ చంద్ర‌బాబు నాయుడు ఎత్తుకోవ‌డంతో తిరిగి ఆయ‌న్ను ప్ర‌శ్నించే ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. ఏపీలో టీడీపీ నేత‌ల‌పై చాల రోజులుగా కేసులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా దీనిపై చంద్ర‌బాబు ఘాటుగానే స్పందిస్తూ రాష్ట్రంలో పోలీసులు త‌మ స్వయంప్రతిపత్తితో ప‌నిచేయాల‌ని సూచిస్తున్నారు. వైసీపీ ఏది చెబితే అది చేయ‌మేంట‌ని వాపోతున్నారు ఆయ‌న‌. అయితే ఈ డిమాండ్ బాగానే ఉన్నా కూడా ఆయ‌న ఇలాంటి డిమాండ్ చేయ‌డ‌మేంటి చాలామంది అంటున్నారు.

ఇందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. గ‌తంలో చంద్ర‌బాబు మూడు సార్లు సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ఇలాగే పోలీసుల‌తో ప‌నిచేయించారు క‌దా అని విమ‌ర్శిస్తున్నారు. అంతెందుకు పోయిన సారి ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు కూడా పోలీసుల‌ను ఇలాగే వాడుకున్నార‌ని అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల‌పై ఇలాగే కేసులు పెట్టారు క‌దా అంటున్నారు నెటిజ‌న్లు. ఆయ‌న చేసిన ప‌నినే ఇప్పుడు వైసీపీ చేస్తోందని విమ‌ర్శిస్తున్నారు. మొత్తానికి పోలీసులను చంద్ర‌బాబు ఎలా వినియోగించుకున్నారో ఇప్పుడు జ‌గ‌న్ అదే దారిలో వెళ్తున్నార‌ని చెబుతున్నారు.