చీరాలలో మారిన రాజకీయం..టీడీపీ-జనసేన ఎఫెక్ట్!

-

గత ఎన్నికల్లో వైసీపీ గాలిని కూడా ఎదురుకుని టీడీపీ సత్తా చాటిన స్థానాల్లో చీరాల కూడా ఒకటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో టీడీపీ నుంచి కరణం బలరాం విజయం సాధించారు. మంచి మెజారిటీతోనే గెలిచిన కరణం..మారిన సమీకరణాల నేపథ్యంలో టీడీపీని వదిలి అధికార వైసీపీలోకి వెళ్లారు. దీంతో అదే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌తో కరణంకు పోరు మొదలైంది. ఆ సీటులో ఇద్దరు నేతలు పోటాపోటిగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇద్దరు సీటు కోసం గట్టిగా ట్రై చేస్తూ వచ్చారు.

కానీ ఈ పోరు వల్ల వైసీపీకే నష్టం జరిగే పరిస్తితి కనిపించింది..దీంతో జగన్ అనూహ్యంగా ఆమంచిని పక్కనే ఉన్న పర్చూరుకు పంపాలని చూశారు గాని…మొదట వర్కౌట్ కాలేదు..కానీ ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో విభేదాలు తగ్గాయి. ఇదే క్రమంలో చీరాల సీటు కరణం వారసుడు వెంకటేష్‌కే అని తాజాగా కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. దీంతో చీరాల సీటుపై క్లారిటీ వచ్చింది.

 

సీటు ఫిక్స్ అయింది గాని చీరాల బరిలో కరణం వారసుడు గెలవగలరా? అంటే చెప్పలేని పరిస్తితి. అక్కడ ఆమంచి వర్గం ఉంది. ఆ వర్గం కరణంకు ఎంతవరకు సహకరిస్తుందో చెప్పలేని పరిస్తితి. ఇక్కడ టీడీపీ బలపడుతుంది..అటు జనసేనకు కాస్త ఓటు బ్యాంక్ ఉంది. పైగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో చీరాలలో కరణం వారసుడుకు గెలుపు అవకాశాలు ఇంకా తగ్గుతాయి. పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి దక్కుతుందో లేక జనసేనకు దక్కుతుందో క్లారిటీ లేదు. మొత్తానికి వైసీపీ నుంచి మాత్రం కరణం వెంకటేష్ బరిలో దిగడం ఖాయమైంది. మరి ఆయన గెలుస్తారా? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news