కేసీఆర్‌కు తేడా కొట్టేస్తుంది… అందుకే స్ట్రాటజీ ఛేంజ్?

-

ఇప్పటివరకు తనకు తిరుగులేదనే ధోరణిలో తెలంగాణ సీఎం కేసీఆర్ నడిచారనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్తితి కనిపించడం లేదు. కేసీఆర్‌కు రాజకీయం పూర్తిగా వ్యతిరేకమయ్యే పరిస్తితి కనిపిస్తోంది. ఊహించని విధంగా కేసీఆర్‌కు బీజేపీ చెక్ పెట్టే పరిస్తితి వచ్చింది. అటు కాంగ్రెస్ సైతం దూకుడుగా ఉంది. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లిన ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇప్పటివరకు కేసీఆర్ తన సొంత వ్యూహాలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టి సక్సెస్‌ఫుల్‌గా రాజకీయం నడిపించుకుంటూ వస్తున్నారు. తనకు అసలు ఎదురేలేనట్లుగా రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడం మొదలుపెట్టారో అప్పటినుంచి సీన్ రివర్స్ అవ్వడం మొదలైంది. కేసీఆర్ ఎలాంటి రాజకీయ వ్యూహం అమలు చేసిన వర్కౌట్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు.

అందుకే కేసీఆర్..తన స్ట్రాటజీ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పూర్తిగా కేసీఆర్ రూట్ మార్చేశారని చెప్పొచ్చు. హుజూరాబాద్ విషయంలో కేసీఆర్ చాలా ధీమాగా ఉన్న విషయం తెలిసిందే. అసలు హుజూరాబాద్‌లో గెలిచేస్తామని ధీమాగా చెప్పారు. అలాగే గెలవడం కోసం అనేక వ్యూహాలతో ముందుకొచ్చారు. కానీ కేసీఆర్ వ్యూహాలు ఏ మాత్రం అమలు కాలేదు. పూర్తిగా తేడా కొట్టేశాయి. ఈటల రాజేందర్ గెలిచేశారు. ఇక ఈటల దెబ్బతో కేసీఆర్ పూర్తిగా తన స్ట్రాటజీ మార్చుకోవడానికి రెడీ అయ్యారు.

ఇకపై సొంత వ్యూహాలు… సొంత సర్వేలని వదులుకుంటున్నట్లు కనిపిస్తోంది. అసలు ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ సర్వేలు చేయించుకుంటారు. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేశారు. కానీ అక్కడే దెబ్బ తిన్నారు. దీంతో కేసీఆర్ సొంత సర్వేలని చేయించడం మానుకుని ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ మధ్య కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథనాల్లో వాస్తవం ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్‌ సంస్థతో టిఆర్ఎస్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయినట్లు సమాచారం. ఏదేమైనా కేసీఆర్ స్ట్రాటజీ మార్చి…తన సొంత వ్యూహాలని పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news