కేసీఆర్….అప్పుడు తప్పించుకున్నారు..ఇప్పుడు బుక్ అయిపోతారా?  

-

రాజకీయాల్లో నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలని నూటికి నూరు శాతం అమలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక కొందరు నాయకులు పూర్తి స్థాయిలో హామీలని అమలు చేయలేరు. అలా ఇచ్చిన మాట తప్పితే ప్రజలు, ఆ నాయకులని తిరస్కరించడం ఖాయం. అందుకే 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పూర్తిగా హామీలని అమలు చేయడంలో విఫలం కావడంతో, 2019 ఎన్నికల్లో  ప్రజలు ఓడించారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సైతం పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయలేదు. కానీ 2018 ఎన్నికల్లో ప్రజలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో మళ్ళీ కేసీఆర్‌నే గెలిపించారు. ఇక రెండోసారి అధికారంలో కొనసాగుతున్న కేసీఆర్, తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని దళితులని ఆకట్టుకోవడమే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదట దీన్ని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేశారు. ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు.

అయితే రాష్ట్రమంతా ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ వస్తుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం మొదట విడతలో నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలకు పది లక్షలు చొప్పున ఇవ్వాలని చూస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ పథకం పూర్తిగా రాష్ట్రంలోని దళితులు అందరికీ అందకపోతే టీఆర్ఎస్‌కే నష్టమని తెలుస్తోంది. ఎందుకంటే మిగిలిన పథకాలు మాదిరిగా ఈ పథకం లేదు. పది లక్షల డబ్బు అంటే ప్రజలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశని నెరవేర్చకపోతే కేసీఆర్‌కే నష్టం.

ఉదాహరణకు గత ఎన్నికల ముందు ప్రతి ఇంటికి కుళాయి అందిస్తానని, అందించకపోతే ఓటు అడగనని కేసీఆర్ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ చాలా ఇళ్లకు కుళాయి అందని పరిస్తితి ఉంది. కానీ ఈ హామీ విషయంలో ప్రజలు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ని గెలిపించారు. కానీ దళితబంధు అలా కాదు…అమలు చేయకపోతే కేసీఆర్ అడ్డంగా బుక్ అయిపోవడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news