ప్రశాంత్ కిషోర్ ని సస్పెండ్ చేసిన సిఎం…!

-

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతా దళ యునైటెడ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ని పార్టీ నుంచి జేడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సస్పెండ్ చేసారు. దేశంలో 2013 నుంచి ఇండియా పొలిటికల్ యాక్షన్ టీం పేరుతో ప్రశాంత్ కిషోర్ పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తూ వస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ఉద్దండులకు షాక్ ఇస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ని ఆయన ముఖ్యమంత్రిని కూడా చేసారు. రాజకీయంగా జగన్ కి అన్ని విధాలుగా అండగా నిలవడమే కాకుండా చంద్రబాబుకి చుక్కలు చూపించారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ని నితీష్ కుమార్ తమ పార్టీ ఉపాధ్యక్షుడిని చేసారు. ప్రస్తుతం నితీష్ ఎన్డిఎలో ఉండగా ప్రశాంత్ కిషోర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తీరు మారలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి ఆయన పని చేస్తున్నారు కూడా. ఆమె కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఆయనకు కూడా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎన్డియేతో విడిపోతే తాను ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన నితీష్ కుమార్ ప్రశాంత్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రశాంతకిషోర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ థాంక్యూ నితీశ్‌ కుమార్‌. మీరు మరోసారి బిహార్‌ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news