రాష్టంలో 15 మంది ఎంపీ లను అసెంబ్లీకి పంపే యోచనలో Cm Ys జగన్..

-

గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇచ్చేలా cm Ys జగన్ పావులు కడుపుతున్నారు.. లక్ష్యం 175 అన్నట్లుగా మొహమాటానికి పోకుండా అభ్యర్థుల ఎంపికలో ఆచితుచి అడుగులు వేస్తున్నారు.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలను పరిష్కరించే ఎమ్మెల్యేల కోసం జల్లిడ వేసి మరీ వెతుకుతున్నారు.. ప్రజాదారణ లేని ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమే అని సీఎం జగన్ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు సర్వేలు చేసి.. వారి పని తీరు ఆదారంగానే టిక్కట్ల కేటాయింపు ఉంటుందని.. తనను కలిసిన ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చెబుతున్నారట..

వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని.. అధికారం వచ్చిన వెంటనే.. వారి సేవలను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని టిక్కెట్ రాని ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్నారు..

ఇప్పటికే పలుదపాలు సర్వేలు చేసిన జగన్ టీం.. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త నేతలను బరిలోకి దింపాలని రిపోర్ట్ ఇచ్చిందట.. అందుకు కనుగుణంగా ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ మూడు నుంచి నాలుగు స్థానాలలో మార్పులు తద్యమనే ప్రచారం జరుగుతుంది..

గెలుపు గుర్రాల వైపే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తూ ఉండడంతో.. వారి ప్లేస్ లో ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపి అసెంబ్లీకి పంపాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.. అందులో భాగంగానే ఇప్పటికే 15 మంది ఎంపీల లిస్టును కూడా జగన్ తయారు చేశారట.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తో పాటు వంగా గీత, వైయస్ అవినాష్ రెడ్డి కూడా అసెంబ్లీ పంపాలని జగన్ ప్లాన్ అని తెలుస్తుంది.

మరోపక్క ఆర్థిక బలం, నియోజకవర్గాలలో మంచి పట్టున్న ఎమ్మెల్యేలను ఎంపీగా పోటీ చేయించాలని.. తద్వారా ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా పడే అవకాశం ఉంటుందని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు.. సర్వేల ఆధారంగా 35 నుంచి 40 మంది దాకా కొత్త వారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.. అయితే టిక్కెట్లు ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పని చేయించుకునేలా సీఎం జగన్ ఎమ్మెల్యే లతో మాట్లాడుతున్నారని.. ఎమ్మెల్యేలలో అసంతృప్తి చాయలు కనిపించకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version