మరో పోరుకు తెర లేపుతున్న రేవంత్.. టీఆర్ఎస్‌కు టెన్షన్

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయింది అనుకునే సమయంలో ఏఐసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా మల్కాజ్ గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి‌ని నియమించింది. రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించిందనే చెప్పొచ్చు. రేవంత్ సైతం సీనియర్లను కలుపుకుని ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘దళిత, గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ సభ’లు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు జనం తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో సభ సక్సెస్ కాగా, కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం మరో పోరుకు ప్లాన్ చేసింది. ఈ సారి నిరుద్యోగులు, యువత కోసం కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనున్నది. ఈ మేరకు నిరుద్యోగ సమస్యపైన పోరు జరిపి, రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ‘నిరుద్యోగ ధర్మ యుద్ధం’ పేరిట సభలు నిర్వహించే ప్లాన్ ఉన్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల నుంచే ఈ నిరుద్యోగ ధర్మ యుద్ధం ఉండబోతున్నదని కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ అంజాతుల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్లో చైతన్యం నింపి అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా రేవంత్ నాయకత్వంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పోరులో భాగంగా నిరుద్యోగులు, యువకులు, యూనివర్సిటీల మేధావులు తదితరులను కాంగ్రెస్ పార్టీ నేతలు కలవనున్నారు. ఇప్పటికే దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభలను తెలంగాణలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సైతం నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తుండగా, నిరుద్యోగ సమస్యపైన కాంగ్రెస్ పార్టీ తన గళాన్ని వినిపించబోతున్నదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news