తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ హాట్ టాపిక్ అని చెప్పాలి. మొదటి నుంచే ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతోంది. ఓ పార్టీ నుంచి పోటీ చేస్తారనుకున్న వారు సైలెంట్ అయిపోవడం లేదంటే బరిలో ఉండరు అనుకున్న వారు సడెన్‌గా తెరపైకి రావడం సంచలంనం రేపుతోంది. ఇక మొదటి నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఇంకోవైపు టీఆర్ఎస్ విషయంలో అయితే మొదటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ నుంచి బరిలో ఉండి క్యాండిడేట్ అవుతాడనుకున్న కౌశిక్‌రెడ్డి సడెన్ గా టీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో కాంగ్రెస్‌కు బలమైన క్యాండిడేట్ కరువయ్యారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ లో అసలు జోష్ కనిపించట్లేదు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు క్యాండిడేట్లను ప్రకటించి వరుసమీటింగులు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి.
కానీ కాంగ్రెస్ మాత్రం ఇంచు కూడా ముందుకు కదలట్లేదు. ఇక కొండా సురేఖను దింపాలని చూస్తున్నా కూడా ఆమెకు నాన్ లోకల్ సెగ తగులుతోంది. ఇప్పుడు హుజూరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన క్యాండిడేట్ కావాలని, అంతేగానీ అభ్యర్థులు దొరకనట్టు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖకు ఇవ్వడమేంటని వ్యతిరేకిస్తున్నారంట. దీంతో ఇటు అధిష్టానం కూడా పునరాలోచనలో పడింది. అయితే సురేఖను తప్పిస్తారా స్థానిక నేతలకు టికెట్ ఇస్తారా అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది.