కాంగ్రెస్ సీనియర్లు సైడ్ అయ్యారా? చేశారా?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం ఫీజులు కట్టి దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ముగిసింది. మొత్తం 119 స్థానాలకు 1025 దరఖాస్తులు వచ్చాయి. అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తులని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి…ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి నేతలని ఎంపిక చేసి..అధిష్టానానికి పంపుతారు. అక్కడ అభ్యర్ధులు ఫైనల్ అవుతారు.

ఇక ఎవరికి సీట్లు దక్కుతాయో ఇప్పుడే తెలిసే ఛాన్స్ లేదు. వచ్చే నెలలోనే కాంగ్రెస్ మొదట లిస్ట్ వస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే సీటు కోసం కొందరు సీనియర్లు దరఖాస్తు చేసుకోలేదు..అంటే వారు సీటు రాదని భావించి అప్ప్లై చేయలేదా? లేదా సీటు ఎలాగో ఇవ్వరని అప్ప్లై చేయలేదా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే కొందరు సీనియర్లు పోటీకి దూరంగా ఉండిపోయారు. వారిలో జానారెడ్డి, గీతారెడ్డి, వి.హనుమంతరావు, నాగం జనార్ధన్ రెడ్డి, మల్లు రవి, రేణుకా చౌదరీ, కోదండ రెడ్డి లాంటి కీలక నేతలు ఉన్నారు.

అయితే జానారెడ్డి ఇద్దరు తనయులు సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకే జానారెడ్డి సైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక నాగం దరఖాస్తు చేసుకున్నారా? లేదా? అనేది క్లారిటీ లేదు. మల్లు రవి ఎంపీ సీటుకు పోటీ చేస్తారని తెలుస్తోంది. గీతారెడ్డి, రేణుకాలకు సీటు గ్యారెంటీ లేదని తెలుస్తోంది. అందుకే వారు దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. వి‌హెచ్, కోదండరెడ్డి పరిస్తితి కూడా అంతే.

మొత్తానికి కొందరు సీనియర్లు కావాలని సైడ్ అయితే..కొందరిని సైడ్ చేశారు. మరి చివరికి ఎవరికి సీట్లు దక్కుతాయి…సీట్లు దక్కని వారు ఏం చేస్తారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version