క్రాంగెస్ వ్యూహకర్త.. వివాదాల పరిష్కర్త : అహ్మద్ పటేల్

-

అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి అహ్మద్ పటేల్ కీలక వ్యక్తిగా మారాడు. 27 ఏళ్ల వయసులోనే ఆయన ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధీ రాజకీయాల్లో కీలక బాధ్యతలను అప్పగించారు. అనతికాలంలోనే ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గట్టెక్కించి.. ఎన్నో వివాదాలను గట్టెక్కించారు. సుధీర్ఘ కాలం పాటు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుడిగా పని చేశారు.

ahmed patel
ahmed patel

1949 ఆగస్టు 21వ తేదీన గుజరాత్ లోని బరూచ్ లో అహ్మద్ పటేల్ జన్మించారు. విద్యార్థి దశలోనే యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించారు. 1976లో తొలిసారిగా బరూచ్ నుంచి లోక్ సభ సభ్యుడిగా బరిలోకి దిగారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, మూడు సార్లు లోక్ సభ, 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 1985లో రాజీవ్ గాంధీకి పార్లమెంట్ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు.

సోనియాగాంధీ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు అహ్మద్ పటేలే అన్ని తానై వ్యవహరించారు. పార్టీ పరిస్థితి, మార్గాలు, వ్యూహాలను ఆమెకు తెలియజేశారు. కాంగ్రెస్ పునర్ వైభవం సాధించేందుకు ఎంతో కృషి చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఎనలేదని పార్టీ వర్గాలు చెబుతుంటారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం ఈ రాజకీయ దిగ్గజానిదే కీలక పాత్ర.

పార్టీలో సంక్షోభం వచ్చిందంటే చాలు అందరూ అహ్మద్ పటేల్ వైపు చూసే వాళ్లు. పార్టీ అంతర్గత విభేధాలైనా.. ప్రభుత్వంలో తలెత్తే సమస్యలైనా పటేల్ తనదైన శైలిలో పరిష్కరించేవారు. 2017లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగిన సమయంలో పటేల్ ను ఓడించడానికి బీజేపీ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా సర్వశక్తుల ప్రయత్నించారు. కానీ అహ్మద్ పటేల్ అనుభవం ముందు అవేమీ చెల్లలేదు. ఒకే రాష్ట్రానికి చెందడంతో ప్రధాని మోదీ, అహ్మద్ పటేల్ మంచి స్నేహితులుగా ఉన్నాయి. అనేక విషయాలపై ఇద్దరు చర్చించుకునేవారు. పార్టీని అనేక సందర్భాల్లో గట్టెక్కించిన అహ్మద్ పటేల్ లేకపోవడం కాంగ్రెస్ కు తీరనిలోటు. కరోనాతో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పలువురు నాయకులు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news