టీడీపీకి బిజెపి ఎంపీలు ఇద్దరు అండగా నిలిచారా…?

-

ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా..? ఉంది కదా… కనపడుతుంది కదా…? చాలా మంది ఇప్పుడు ఆ ఆలోచనల్లోనే ఉన్నారు కదా…? సరే… ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది…? వారిని ఆపుకునే శక్తి బాబుకి ఉందా…? బాబు మాటలను ఈ దశలో నమ్మే అవకాశం ఉంటుందా…? ఉండదు. ఇంకా ఒకరో ఇద్దరో వెళ్తే బాబు ఇంటి ముందు చెక్ పోస్ట్ కూడా ఉండే అవకాశం లేదు. ఈ మాటలు మంత్రి కొడాలి నానీ కూడా ఒక సందర్భంలో చేసారు. ఆయన అనడం కాదు… అది అక్షరాలా నిజం.

మరి నేతలను చంద్రబాబు కాపాడుకోవడం సాధ్యం అవుతుందా…? అందుకే బిజెపి ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్ ను ఆయన రంగంలోకి దించారట. వాళ్ళు టీడీపీ నేతలను ఎలా ఆపేస్తారు అంటారా…? దేశంలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలకు ఏది అయినా సాధ్యం అవుతుంది. అలాగే వారికి కూడా అది సాధ్యం అవుతుంది. టీడీపీ నుంచి బయటకు వెళ్ళినా సరే చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా ఆ ఇద్దరు పాటించే అవకాశం ఉంటుందని అంటారు. తెలుగుదేశం రాజకీయ బిక్ష పెట్టింది కాబట్టి వారు ఆ పార్టీని కాపాడతారు ఎక్కడ ఉన్నా సరే అంటూ ఉంటారు.

ఇప్పుడు అదే జరుగుతుంది అని చాలా మంది అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారాలని చూడగా… నువ్వు వెళ్తే నేను పర్సనల్ గా తీసుకుంటా అనే బెదిరింపు ఆ ఎమ్మెల్యేకి వెళ్ళింది. ఎలా అండి నా వ్యాపారాలను టార్గెట్ చేసారు… విపక్షంలో ఉంటే వర్గాన్ని ఎలా ముందుకి నడిపించడం సాధ్యం అవుతుంది అని ఒక ప్రశ్న వేసారట. నీకు ఏ ఇబ్బంది లేదు, న్యాయ సహాయం నేను చేస్తా… కంగారు వద్దు. ముందుకు నేను నడిపిస్తా అని హామీ ఇచ్చారట.

ఆ హామీ తర్వాత ఏపీ మంత్రి నుంచి ఆ ఎమ్మెల్యేకి బాగా ఒత్తిడి పెరిగింది. వాళ్ళు రాష్ట్రంలోనే మంత్రులు నేను రాజ్యసభలో అధికార పార్టీ ఎంపీని అని అన్నారట. దీనితో ఏదైనా నాకు సాధ్యమే అనే సంకేతం ఇచ్చారట. వెంటనే ప్రతి కీలక నేత ఒకరు లైన్ లోకి వచ్చి, ఏ చర్య ప్రభుత్వం నుంచి వచ్చినా వీ ఆర్ విత్ యూ అనే డైలాగ్ చెప్పారట. దీనితో సదరు ఎమ్మెల్యే  మార్చేసి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి మంచులో ఎంజాయ్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news