అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ – కేసీఆర్ ల వాధనలు ఇవి!!

-

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే! ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది! ఈ మీటింగ్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ఏమి మాట్లాడారనే విషయాలు ఇప్పుడు చూద్దాం!

ఈ విషయంలో స్పందించిన కేసీఆర్… అంత‌రాష్ర్ట జ‌ల‌వివాదం చ‌ట్టం -1956లోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం విచార‌ణ‌కు డిమాండ్ చేశారంట! కృష్ణాజలాల్లో వాటాతోపాటు, గోదావరిలో మిగులు వాటాను కూడా తేల్చాలని.. పోలవరం వాటాకు సంబంధించి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల గురించి కూడా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది!

ఇక తన వాదనలు వినిపించిన జగన్…  శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలతోపాటు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నిటినీ కేంద్రమే అధీనంలోకి తీసుకుని పర్యవేక్షించాలని జగన్‌ జలశక్తి మంత్రికి సూచించారంట! అలాగే కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలన్న డిమాండ్నూ  కేంద్రం ముందుంచారంట!  ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తన వాదన వినిపించినట్టు తెలిసింది.

ఇదే క్రమంలో.. రాయలసీమ, ప్రకాశం వంటి దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఏపీ ముఖ్యమంత్రి అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది!! ఇదే క్రమంలో… పొరుగు రాష్ట్రంలో సఖ్యతతో మెలుగుదామని.. సమన్యాయం నినాదంతో ముందుకు వెళ్దామని చెప్పినట్లు తెలుస్తోంది!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news