తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ అధ్యాయం ఇప్పడు ఎంత హాట్ టాపిక్‌గా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక పరిణామాల క్రమంలో ఆయన టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో ఇప్పుడు ఉప ఎన్నికకు తెర లేపారు. ఇక ఉప ఎన్నికకు ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ మీద, సీఎం కేసీఆర్ మీద ఎవరికీ తెలియని నిజాలను బయట పెడుతూనే ఉన్నారు. ఇక ఇదే క్రమంలో మరోసారి ఆయన హరీశ్‌రావు harishrao గురించి సంచలన కామెంట్లు చేశారు.
గతంలో కూడా మంత్రి హరీశ్‌రావుకు జరిగిన అవమానాలు, ఎదురైన ఇబ్బందుల గురించి ఈటల ఇదే విధంగా షాకింగ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి హరీశ్ రావుకు మినిస్టర్ పదవి రాకుండా కేసీఆర్ ఏ విధంగా అడ్డుకున్నాడో వివరించారు ఈటల రాజేందర్.
తామిద్దరం టీఆర్ ఎస్‌లో మొదటి నంఉచి చాలా పట్టున్న నేతలుగా ఉండటంతో ఇద్దరి ఎఫెక్ట్‌ను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారిద్దరినీ క్యాబినెట్‌లోకి తీసుకోకుండా కావాలనే జాప్యం చేశారని, కావాలనే ఆయన పేపర్‌లో వారిద్దరికీ మంత్రి పదవి రాదని వార్తలు రాయించారని ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు చేశారు. అయితే తామిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వకుటే పార్టీలో వ్యతిరేకత వస్తుందేమో అని భయపడి చివరకు మంత్రి వర్గంలోకి తీసుకున్నట్టు వివరించారు.