కిష‌న్‌రెడ్డితో ఈట‌ల భేటీ.. అనుకూల నాయ‌కుల‌తోనే మంత‌నాలు.. అస‌లు విష‌య‌మేంటి?

-

ఈటల రాజేంద‌ర్ మ‌ళ్లీ రాజ‌కీయాలను ప‌రుగులు పెట్టిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌, బీజేపీ అసంతృప్తి నేత‌ల‌ను క‌లిసిన ఆయ‌న గ‌త మూడు రోజులుగా కాస్త సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ జాతీయ‌నేత భూపేంద‌ర్ యాద‌వ్‌, బండి సంజ‌య్ కూడా ఇందులో పాల్గొన్నారు.

సిటీ శివారులో వివేక్ వెంక‌ట‌స్వామికి చెందిన ఓ ఫామ్ హౌస్‌లో వీరు ర‌హ‌స్యంగా మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో వారు బీజేపీలోకి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. కానీ పార్టీలో చేరే విష‌యంపై ఈట‌ల క్లారిటీ ఇవ్వ‌లేదు.

అయితే ఏ పార్టీలో చేర‌బోన‌ని స్ప‌ష్టం చేసిన ఈట‌ల.. ఇప్ప‌డు బీజేపీ అగ్ర నేత‌ల‌ను క‌ల‌వ‌డం కాస్త అనుమానంగా ఉంది. అయితే ఆయ‌న మ‌ద్ద‌తు కోస‌మే వారి వ‌ద్ద‌కు వెళ్లిన‌ట్టు ఆయ‌న వ‌ర్గీయులు తెలుపుతున్నారు. ఒక‌వేళ ఉప ఎన్నిక వ‌స్తే త‌న‌కు ఎవ‌రూ పోటీ ఉండ‌కుండా, మ‌ద్ద‌తు తెలిపేలా చూసుకుంటున్నారు. మొత్తానికి ఈట‌ల అన్న‌ట్టు ఆర్ ఎస్‌యూ నుంచి ఆర్ ఎస్ ఎస్ దాకా అంద‌రినీ క‌లుపుకుని పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news