తప్పు చేశానని ఈటల రాజేందర్ ఒప్పుకున్నాడు…

అధికార టీఆర్ఎస్ పార్టీపై పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసి అనంతరం బీజేపీ గూటికి చేరి కాషాయ కండువా కప్పుకున్నారు ఈటల రాజేందర్. దాదాపు రెండు నెలల నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేసినా… కూడా మంత్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించలేదు. అనేక మంది టీఆర్ఎస్ లీడర్లు ఈ ఉదంతం పై మాట్లాడినా… కానీ కేటీఆర్ నోరు విప్పలేదు. ఎన్నో పర్యటనలు చేసినా కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. అసలు ఇటువంటి విషయమే జరగడం లేదన్నట్లు ఆయన సైలెంట్ గా ఉన్నారు. అనేక మంది విశ్లేషకులు ఆయన సైలెన్స్ వెనుక ఎలాంటి అర్థం దాగుందా అని ఆలోచించారు. కానీ ఇన్నాళ్లకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదంతం పై మరో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారడం ఈటల వ్యక్తిగత నిర్ణయమని, కానీ టీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయన చెప్పినట్లు ఐదు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ లో గౌరవం లేకపోతే ఇన్నాళ్లు అసలు పార్టీలో ఎందుకున్నారని ప్రశ్నించారు.

ఓ పక్క ఆయన క్యాబినేట్ లో మంత్రిగా కొనసాగుతూనే మరో పక్క ప్రభుత్వంపై ప్రభుత్వ నిర్ణయాలుపై ప్రతిష్టాత్మక పథకాలపై అనేక విమర్శలు చేశాడని గుర్తు చేశారు. భూ కబ్జా చేశాడంటూ వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ… ఈ విషయంలో రాజేందర్ స్వయంగా తన తప్పును తానే ఒప్పుకున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకుల మీద తీవ్ర విమర్శలు గుప్పించారు . వారికి సబ్జెక్ట్ లేదన్నారు. అసలు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నాడో ఆయనే ఆలోచించుకోవాలని తెలిపారు.