బిగ్ బ్రేకింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలు ?

అమరావతి రాజధాని విషయం గత నెల రోజుల నుండి ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ జరగాలని మూడు రాజధానులు అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అమరావతి ప్రాంతంలో రైతులు సీఎం జగన్ చెప్పిన అభిప్రాయం పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళనలు మరియు నిరసనగా అమరావతి ప్రాంతంలో చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలసి అమరావతి ప్రాంతంలో నిరసనలు చేపట్టి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఇదే విషయాన్ని ఎజెండాగా తీసుకుని వైయస్ జగన్ రాజీనామా చేసి ఎన్నికల్లో కి రావాలని ఇటీవల కామెంట్లు చేశారు. అమరావతి విషయాన్ని రెఫరెండం గా తీసుకుని ఎలక్షన్ కి వెళ్లి వైయస్ జగన్ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు.

ఈ నేపథ్యంలో అమరావతి మూడు రాజధాని అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజా బ్యాలెట్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఇది ఎన్నికల లాంటిదే అంటూ ప్రజా బ్యాలెట్ కూడా ఒకరకంగా ఎన్నికలే అవుతుందని ప్రజా బ్యాలెట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి మరియు మూడు రోజుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.