హుజూరాబాద్‌లో చెరో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈట‌ల‌, హ‌రీశ్‌రావు..

-

రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. అధికార టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు స‌భ‌లు, స‌మావేశాలు.. ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌తో జోరు పెంచాయి. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ పార్టీ నుంచి బ‌రిలో నిలుస్తుండ‌గా.. టీఆర్ ఎస్ నుంచి టీఆర్ ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటిలో ఉన్నారు. ఇద్ద‌రు నేత‌లు బీసీ కార్డుతో ప్ర‌జ‌ల‌లోకి వెళ్తున్నారు. గ‌తంలో కారు గుర్తుపై పోటీ చేసినా ఈట‌ల‌.. ఈ సారి పువ్వు గుర్తుపై పోటీకి సిద్ధ‌మౌతున్నారు. ప్ర‌జ‌ల‌లో ఈట‌ల‌పై సానుభూతి ఉన్నా.. బీజేపీలో చేర‌డం కొంత ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌న‌.. బీజేపీని ఫోక‌స్ చేయ‌కుండా త‌న స్వంత బ‌లంపై ఈట‌ల రాజేంద‌ర్ దృష్టి పెట్టారు. ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌ర్గంలో చేప‌డుతున్న స‌మావేశాల‌లో ఎక్క‌డ మోడీ బొమ్మ లేకుండా ప్ర‌చారం సాగుతుంది. కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా ఈట‌ల ఎక్క‌డా ప్ర‌స్త‌వించ‌డం లేదు.

etela rajender harish rao

 

బీజీపీ నుంచి పోటి చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్.. ప్ర‌జ‌ల‌లోకి మాత్రం త‌న స్వంత ఇమేజ్‌తో వెళ్లాల‌ని భావిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల కాషాయం రంగు లేని ప్రచార ర‌థాల‌తో ప్ర‌చారం చేప‌డుతున్నారు. తాను నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన అభివృద్ధి..సీఎం కేసీఆర్ త‌న‌కు చేసిన ద్రోహ‌న్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. తాను టీఆర్ ఎస్‌లో నుంచి పోమ్మ‌న‌లేక పొగ‌పెడుతున్నార‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించి సానుభూతి పెందే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇటివ‌ల మంత్రి హ‌రీశ్‌రావుపై ఈట‌ల విమ‌ర్శ‌లు గుప్పించారు. హుజూరాబాద్‌లో హ‌రీశ్‌రావు, లేదా సీఎం కేసీఆర్ వ‌చ్చి పోటి చేయాల‌ని స‌వాల్ విసిరారు. లేక‌పోతే ఓట‌మిని అంగిక‌రించాల‌ని ఈట‌ల పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు ఆయా పార్టీలు ప్ర‌ధానంగా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌పైనే దృష్టి పెడుతున్నారు. ఎలాగైన గెలిచి సీఎం కేసీఆర్‌కు స‌వాల్ విసురాల‌ని ఈట‌ల బావిస్తుండ‌గా.. ఈట‌ల‌కు చెక్ పెట్టి కేసీఆర్ పైనే ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉంద‌ని టీఆర్ ఎస్ భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news