ఓట్లు పోతున్నాయి..దొంగ ఓట్లు వస్తున్నాయి?

-

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నుంచి ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్లు అంశం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో గెలిచేందుకు అధికార వైసీపీ పక్కనే ఉన్న నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లని తీసుకొచ్చి ఓట్లు వేయించిందని..తిరుపతి పార్లమెంట్‌కు ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుండగానే ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు ఆరోపణలు చేశారు. అలాగే పోలింగ్ లైన్లలో నిల్చున్న పలువురు దొంగ ఓటర్లని మీడియా పట్టుకుంది.

అయితే ఈ దొంగ ఓటర్లని టి‌డి‌పినే తీసుకొచ్చిందని వైసీపీ ఆరోపించింది. ఇక ఎవరు తీసుకొచ్చారనే అంశంపై వాస్తవాలు బయటపడలేదు గాని..దొంగ ఓట్లు మాత్రం పడ్డాయని అర్ధమైంది. తర్వాత ఆత్మకూరు ఉపఎన్నికలో అదే జరిగిందని, ఇక చంద్రబాబు సొంత స్థానం కుప్పంలో మున్సిపాలిటీ గెలిచేందుకు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి దొంగ ఓటర్లని తీసుకొచ్చారని వైసీపీపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు కొత్తగా కొన్ని ఓట్లు పోవడం జరుగుతుంది..అదే సమయంలో ఒకే డోర్ నెంబర్ లో వందల కొద్ది ఓట్లు నమోదు అవుతున్నాయి.

ఇటీవల గుంటూరులో ఒకే డోర్ నెంబర్ తో 500 పైనే ఓట్లు నమోదయ్యాయి అంటా..అంటే అవన్నీ ఎవరు నమోదు చేశారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బూత్ 152 లో ఒకే డోర్ నెంబర్ పై 506 ఓట్లు నమోదయ్యాయని టి‌డి‌పి నేత బోండా ఉమా ఆధారాలతో సహ మీడియాకి వివరించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఓటరు లిస్టులో 7879 ఓట్లు తొలగించి..కొత్తగా 2360 ఓట్లు నమోదు చేశారట.

అయితే టి‌డి‌పి ఓట్లు తొలగించి..కొత్తగా వైసీపీ దొంగ ఓట్లు సృష్టిస్తుందనేది టి‌డి‌పి చేస్తున్న ఆరోపణ. అలాగే కుప్పం నియోజకవర్గంలోని ఓ వూరులో వందల కొద్ది ఓట్లు తొలగించారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇలా ఓట్లు లేపేయడం, దొంగ ఓట్లు వస్తే..వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news