Flash: పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన లో వున్న సంగతి తెలిసిందే..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం కోసం శనివారమే పవన్ వైజాగ్ చేరుకున్నారు. శనివారం రాత్రి ఆయన నగరంలోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు..

జనసేన నేతలు బస చేస్తున్న ఫ్లోర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నోవాటెల్ పరిసరాల్లోకి జనసేన కార్యకర్తలతో పాటు ఎవరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు..

ప్రస్తుతం వైజాగ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాసేపటిలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా పోలీసులు వద్దని వారిస్తున్నారు.నిన్న వైసీపి మంత్రుల పై జరిగిన దాడి,వైజాగ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వైజాగ్ నుంచి పవన్ కళ్యాణ్ ను వెళ్ళిపోవాలని సూచించారు.కానీ పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పడం తో ఆయనను అరెస్ట్ చేసి వైజాగ్ నుంచి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం..

 

Read more RELATED
Recommended to you

Latest news