గండ్ర వర్సెస్ గండ్ర: భూపాలపల్లిలో హాట్ ఫైట్!

-

ఎప్పుడైతే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర భూపాలపల్లి నియోజకవర్గంలో మొదలైందో.అప్పటినుంచి అక్కడ రాజకీయంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది. మొదట ఫ్లెక్సీల దగ్గర గొడవ..ఆ తర్వాత రేవంత్ రోడ్ షోలో బి‌ఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ళు, టమోటాలు, కోడి గుడ్లు విసరడం, బదులుగా కాంగ్రెస్ శ్రేణులు బి‌ఆర్‌ఎస్ శ్రేణులపై దాడి చేయడం..అలా రెండు వర్గాల మధ్య పెద్ద పంచాయితీ నడిచింది.

అదే సమయంలో గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచి..ఆ తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేసిన గండ్ర  వెంకటరమణారెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం..బదులుగా గండ్ర కౌంటర్లు ఇవ్వడం, తన అక్రమాలని నిరూపించాలని సవాల్ చేయడం..దీనికి భూపాలపల్లి కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ స్పందించడం..ఇద్దరు నేతలు వరుసగా సవాళ్ళు విసురుకోవడంతో భూపాలపల్లి రణరంగంగా మారింది.

bhupalapalli

తనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు వాటిని నిరూపించేందుకు ఆధారాలతో సహా రావాలని గండ్ర వెంకటమణారెడ్డి సవాల్‌ విసరడం, దాన్ని గండ్ర సత్యనారాయణరావు స్వీకరించడం అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లయింది. కాంగ్రెస్‌ నాయకులు దమ్ముంటే స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే గండ్ర ఛాలెంజ్ చేశారు. దీంతో భూపాలపల్లి సెంటర్ లో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. కానీ పోలీసులు రెండు వర్గాలని ఆపేయడంతో కాస్త వివాదం సద్దుమణిగింది.

అయినా సరే రాజకీయంగా మాత్రం భూపాలపల్లిలో వార్ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేసిన గండ్ర రమణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చూస్తుంది. ఇదే క్రమంలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ లోకి రావడంతో..పోరు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గండ్ర వర్సెస్ గండ్ర అనే విధంగా వార్ నడవనుంది. చూడాలి ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news