విజయసాయికి గంటా షాక్… పార్టీ మారితే చంద్రబాబుకి చెప్తా

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతూ గంటాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. గంటా కచ్చితంగా పార్టీ మారవచ్చు అని, వైసీపీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. టీడీపీ అనుకూల మీడియా వీటిని ఎక్కువగా ప్రసారం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన పార్టీ మారవచ్చని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు స్పందించారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు అని ఆయన స్పష్టం చేసారు. ఒకవేళ మారాల్సి వస్తే అధినాయకుడు తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు. నాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది రాత్రికి రాత్రి మారిపోతే నేను చరిత్రహీనుడుగా మిగిలి పోతానన్నారు.

నేను పార్టీ మారనని ఎన్నిసార్లు చెప్పినా మీడియాలో ఇలాంటి కథనాలు వస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. వైసిపి తో ఏం చర్చలు జరిపానొ విజయసాయిరెడ్డి చెప్పాలి అని సవాల్ చేసారు. నాకు అత్యంత సన్నిహితుడు కాశి వైసీపీలో, చేరుతానని నాతో ముందే చెప్పాడు అని, తనకు ఇబ్బందులు ఉన్నాయని అందుకే పార్టీ మారాల్సి వస్తుందని ముందే చెప్పాడు అని అన్నారు.