లూజ‌ర్స్ క్ల‌బ్ అధ్య‌క్షుడుగా చంద్ర‌బాబు : జీవీఎల్

-


అమరావతి: ఆత్మ‌ర‌క్ష‌ణ కోసమే చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్.నరసింహారావు ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవముందని, మోదీ కన్నా తానే సీనియర్ అంటున్న చంద్ర‌బాబు.. అఖిలేష్ లాంటి బచ్చాలతో కలిసి బీజేపీని ఏం చేయలేరని ధ్వజమెత్తారు. శరద్‌యాదవ్ ఏ పార్టీలో ఉన్నారని బాబు కలుస్తున్నారని ప్రశ్నించారు. మాయావతి.. చంద్రబాబును కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి మాట్లాడారని వివరించారు. మరోసారి వెళ్తే కింద కూర్చోబెట్టి మాట్లాడతారేమోనని వ్యాఖ్యానించారు. ఓడిపోయిన పార్టీలను కలుపుకుని లూజర్స్ క్లబ్ పెట్టుకుంటున్నారని విమర్శించారు. దాని వల్ల మాకే లాభం కానీ.. వచ్చే నష్టం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పస్టంచేశారు. 2014లో 282 సీట్లుతో అధికారంలోకి వచ్చామని.. 2019లో కూడా మళ్లీ మాదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో కలిసిపోతున్న చంద్రబాబు.. 2019లో గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందన్నారు. కానీ అదే పార్టీతో కలిసి వెళ్లడమంటే తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version