దుబ్బాకలో హరీష్ రావుVS రఘునందన్ రావు.. ఇరువైపులా జంపింగులే

-

దుబ్బాక(Dubbaka)మున్సిపాలిటీకి చెందిన నేతల ప్రవర్తన ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. వారు చేసిన నిర్వాకం వల్ల రాష్ర్ట వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. అదేదో మంచి విషయాల్లో అని అనుకుంటే పొరబడినట్లే . అసలేం జరిగిందంటే… దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు నేతలు నిన్న బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్​ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ నడిచింది. అధికార టీఆర్ఎస్​ నుంచి అదీ సీఎం సొంత జిల్లా లో ఇలా టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు నేతలు. ఈ రోజు పొద్దున వరకు మరలా వారిని సెట్​ చేసి వారితో మళ్లా కండువాలు మార్చే కార్యక్రమం పెట్టించారు. ఇలా ఒకే రోజు వ్యవధిలో ఒకే వ్యక్తి రెండు పార్టీకు వెళ్లడం చూసిన జనాలు చేసేదేం లేక హవ్వా ఇదేం తీరు అని అనుకుంటున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్​ ట్రబుల్ షూటర్​ హరీష్​ రావు బాధ్యతలు అప్పగించినప్పటికీ అక్కడ బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమిని ఇంకా మర్చిపోని టీఆర్ఎస్​ నాయకులకు ఇలా కౌన్సిలర్లు పార్టీ మారడం ఏ మాత్రం రుచించలేదు. దీంతో రాత్రికి రాత్రే వారిని బెదిరించో బతిమలాడో పార్టీలోకి తీసుకువచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా మిగిలిన మూడో వ్యక్తి కూడా త్వరలోనే తిరిగి గులాబీ గూటికి చేరుతారని ధీమాగా చెబుతున్నారు. ఇలా పార్టీలో చేరిన వారికి ట్రబుల్​ షూటర్​ హరీష్​ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఈ దుబ్బాక కౌన్సిలర్లు చేసిన పని వల్ల ఒకే రోజులో రాష్ర్ట వ్యాప్తంగా ఫేమ్​ సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news