ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

-

ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కోకాపేట 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి తెలంగాణ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే భూముల వేలానికి వ్యతిరేకంగా ఇటీవలే…బీజేపీ నేత విజయశాంతి పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. తాజాగా విజయశాంతి వేసిన పిల్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.


భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13 ను కొట్టివేయాలని ఈ సందర్భంగా విజయశాంతి కోరింది. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున వేలం వేస్తున్నామని తెలంగాణ ఏజీ హైకోర్టు కు బదులించారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైకోర్టు. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై పూర్తిస్థాయి వాదనలు వింటామని స్పష్టం చేసింది హైకోర్టు. అలాగే..రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news