గెలుపు అసాధ్యమని భావించిన చోట.. తమకు తిరుగులేదని బిజేపీ నిరూపించింది.. హర్యానాలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తో పాటు.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా.. బిజేపీ మాత్రం ధీమాగా ఎన్నికల బరిలోకి దిగింది.. చేసిన అభివృద్దిని… భవిష్యత్ లో చేపట్టబోయే పనులను వివరించి.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.. హర్యానాలో బిజేపీ రికార్డు సృష్టించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతోంది..
హర్యానాలో హ్యట్రీక్ సాధించిన బిజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది.. అక్టోబరు 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అనంతరం 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. అయితే అక్టోబర్ 17వ తేదీని ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక కారణం ఉందనే ప్రచారం బిజేపీలో జరుగుతోంది.. అందులో బీజేపీ రాజకీయ వ్యూహం కూడా దాగుందట..
హర్యానాలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ.. తెలుగు రాష్టాల్లో బీసీ జాబితాలో ఉండగా.. ఉత్తరాది రాష్టాల్లో ఎస్టీ, ఎస్టీ జాబితాలో ఉన్నారు.. హర్యానాలో ఉన్న ఈ కులస్తులు గత ఎన్నికల్లో బిజేపీకి మద్దతుగా నిలిచారు.. ఇతర రాష్టాల్లో ఉండే వారు కూడా తమ పార్టీకి అనుకూలంగా ఉండేలా బిజేపీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోందట.. రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి ఈసారి అక్టోబర్ 17న వచ్చింది. అలాంటి పర్వదినాన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వాల్మీకి సమాజానికి ఓ సందేశం ఇవ్వాలని చూస్తోందట.
వాల్మీకి మహర్షి వాల్మీకి ‘బోయ’ కులానికి చెందినవారు.. అన్ని రాష్దాల్లో ఉన్న వాల్మీకులు .. వాల్మీకి మహర్షిని దేవుడిలా పూజిస్తారు.. ఈ నేపథ్యంలో వారిని దగ్గరకు తీసుకునేందుకు అక్టోబర్ 17న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. రాజకీయాల్లో కులాలు, సామాజికవర్గాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలుపొందిన బీజేపీ, తమ గెలుపులో దళిత వర్గం పాత్రను గుర్తిస్తూ.. వారిని తమతోనే ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని టాక్ వినిపిస్తోంది.. అందులో భాగంగానే.. వాల్మీకి జయంతి నాడు హర్యానా కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీరేలా ఏర్పాట్లు చేస్తోంది.. దీన్ని ఆ సామాజికవర్గ నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..