పాలమూరుపై హస్తం ఫోకస్..కారుకు బ్రేకులు కష్టమే.!

-

పాలమూరుపై: పాలమూరులో రాజకీయం రంజుగా మారింది. ఎన్నికలు దగ్గరపడటంలో 14 సీట్లు ఉన్న ఉమ్మడి జిల్లాపై అన్నీ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పార్టీ హవా నడుస్తుంది. ఆ పార్టీ మంచి విజయాలు సాధిస్తూ వస్తుంది. ఈ సారి కూడా ఈ జిల్లాలో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటాలని చూస్తుంది.

కానీ వరుసగా రెండు సార్లు గెలవడంతో..జిల్లాలో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. పైన కే‌సి‌ఆర్ పట్ల సానుకూలత ఉంది. దీంతో కే‌సి‌ఆర్..ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలని మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి జిల్లాలో కొన్ని సీట్లలో కొత్త అభ్యర్ధులని బరిలో దించే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండేది ఇప్పుడు పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. పాలమూరులో ఘన విజయం సాధించాలని చూస్తుంది.

అయితే కారుకు చెక్ పెట్టి కాంగ్రెస్ హవా అనేది పాలమూరులో నడవటం కాస్త కష్టమే. అయినా సరే కారుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కిలోమీటర్లు చేరిన సందర్భంగా జడ్చర్లలో భారీ సభ పెట్టారు. ఈ క్రమంలో సభకు హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..తమ నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు గెలుస్తామని..ఇక్కడ 14కి 12 సీట్లు గెలవాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

దీంతో రేవంత్..12 కాదు 14 సీట్లు గెలుస్తామని అన్నారు. అయితే నల్గొండ రాజకీయం వేరు..పాలమూరు వేరు..ఇక్కడ బి‌ఆర్‌ఎస్ తో పాటు కొన్ని స్థానాల్లో బి‌జే‌పితో కూడా గట్టిగా పోటీ పడాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి పాలమూరులో కాంగ్రెస్ ఏ మేర సత్తా చాటుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version