కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు..!

-

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ఇంతకుముందే ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే అనుమానితులకే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల్లో ఎక్కడుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అయితే తాజాగా మరోసారి కరోనా పరీక్షలల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ మండిపడింది. కరోనా వైరస్ కు సంబంధించి కీలక సమాచారాన్ని మీడియా బులిటెన్ లో ఉంచాలని, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైద్యులకు, పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని, నగర పరిధిలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news