టీఆర్ఎస్ కు షాక్… దళితబంధు పిటీషన్లు కొట్టివేసిన హై కోర్ట్

హుజూరాబాద్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళితబంధు పథకాన్ని ఆపివేయాలంటూ గతంలో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే కొంత మంది దళితబంధును అమలు చేయాలంటూ హైకోర్ట్ లో పిటీషన్లను దాఖలు చేశారు. 

కాగా ఈ అంశం నేడు విచారణకు వచ్చింది. దళితబంధు అమలు చేయాలంటూ దాఖలైన 4 పిటీషన్లను హై కోర్ట్ కొట్టివేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ కీలకవ్యాఖ్యలు చేసింది. పిటీషన్ల చేసిన వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకోలేదు. కాగా హుజూరాబాద్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పథకాన్ని ప్రారంభించారు. అయితే పథకం అమలు ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఉందని పలువురు ఎన్నికల కమీషన్ ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పథకం అమలును నిలిపివేయాలంటూ ఈసీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.