కారు నుంచి హరీష్‌ అవుట్…ఉపఎన్నిక తర్వాత ఏం జరగనుంది?

-

తెలంగాణ రాజకీయాలని హుజూరాబాద్ ఉపఎన్నిక వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ఆ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోయింది. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా జరుగుతున్న ఈ పోరులో పైచేయి సాధించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు రావడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

అయితే ఉపఎన్నికపై ఆధారపడి హరీష్ రావు…రాజకీయం ఉండనుందని తెలుస్తోంది. ఎంత కాదు అనుకున్న కేటీఆర్‌కు పెద్ద పీఠ వేయడం కోసం కేసీఆర్….హరీష్ రావుని నిదానంగా సైడ్ చేశారని క్లియర్ గా అర్ధమవుతుంది. తాజాగా జరిగిన ప్లీనరీ సమావేశంలో కూడా అదే జరిగింది. ఇక కేసీఆర్ తర్వాత పార్టీని నడిపించేది….తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ అని అందరికీ అర్ధమైపోతుంది. ఈ క్రమంలోనే హరీష్‌ని సడి చేస్తున్నారనే విషయం కూడా తెలిసిందే.

అందుకే ప్లీనరీ సమావేశంలో నేతలు…కేసీఆర్, కేటీఆర్లకు భజన చేయడంలోనే నిమగ్నమైపోయారు…ఇక పార్టీ కోసం కష్టపడుతున్న హరీష్ ఊసు పెద్దగా రాలేదు. పైగా ఆయన హుజూరాబాద్ ప్రచారంలో ఉండటంతో ప్లీనరీ సమావేశానికి రాలేదు. ఇక ఇదే విషయాన్ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ను మెడలు పట్టి బయటికి గెంటిన కేసీఆర్‌.. హరీశ్‌రావును ప్లీనరీకి రాకుండా హుజూరాబాద్‌ చెట్టుకు కట్టేశాడని, ప్లీనరీ మొత్తం తండ్రీకొడుకుల భుజకీర్తులు, రామ.. చంద్ర కీర్తనలు వాయించుకున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ చెప్పిన మాటలు కూడా వాస్తవమే అని చెప్పాలి. ఎందుకంటే ప్లీనరీలో అవే సన్నివేశాలు నడిచాయి…ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్ భజనలే జరిగాయి. దీని బట్టి చూస్తే హరీష్‌ని కూడా కారులో నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే కాస్త డౌట్ గానే ఉందని చెప్పొచ్చు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఓకే…లేదంటే హరీష్‌ని సైడ్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news