నేటితో ముగియనున్న బైపోల్ నామినేషన్లు… నేడు ఈటెల నామినేషన్

-

హుజూరాబాద్ బైపోల్ రణరంగాన్ని తలపిస్తోంది. నేడు బైపోల్ పోరుకు ఎంతమంది నామినేషన్లు వేశారనే లెక్క తేలనుంది.  ఈనెల 1 నుంచి 8 వరకు నామినేషన్లను గడువు ఉందని ఈసీ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ రోజు బీజేపీ తరుపున ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరుపున వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈటెల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈనెల 11 వరకు స్క్రూటినీ జరగనుంది. 13 తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రాకు గుడువు ఉంది. 13 తర్వాతనే హుజూరాబాద్ ఉపపోరులో ఎంతమంది ఉంటారనే దానిపై క్లారిటీ రానుంది. ఇదే షెడ్యూల్ ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు వర్తించనుంది. నామినేషన్ల అనంతరం పార్టీ తరుపు స్టార్ క్యాంపెనర్లు ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news