కాంగ్రెస్ లోకి ఈటల, వివేక్…భట్టికి కేటీఆర్ గేలం…

హుజూరాబాద్‌లో పై చేయి సాధించడానికి కారు పార్టీ ఎన్ని కష్టాలు పడుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. అసలు ఈటల రాజేందర్‌ని ఓడించడానికి నానా తిప్పలు పడుతున్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఈటలని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ప్రయత్నం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే హుజూరాబాద్ బరిలో మంత్రి హరీష్ రావు…ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే.

congress
congress

కానీ ఆయన రాజకీయం ఏ కోశాన కూడా వర్కౌట్ కావడం లేదు. ఆయన ఈటలని దెబ్బకొట్టడానికి కేంద్రంలో ఉన్న బి‌జే‌పి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దాని వల్ల పావలా ఉపయోగం లేదనే సంగతి తెలిసిందే. ఇక ఇంతవరకు హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టని కేటీఆర్ సైతం….లాజిక్‌ లేని రాజకీయం మొదలుపెట్టారు. హుజూరాబాద్ ఎన్నికని లైట్ తీసుకుంటున్నామని చెబుతూనే, చాలా సీరియస్‌గా ఎన్నికలో గెలవడానికి చూస్తున్నారు. అక్కడ ఎలాంటి ఫలితం వచ్చిన కేటీఆర్ సేఫ్‌ అయిపోతారు…ఎందుకంటే ఆయన హుజూరాబాద్ జోలికి పోవడం లేదు. ఇక రిజల్ట్ బెడిసికొడితే హరీష్‌కే నష్టం.

ఆ విషయం పక్కనబెడితే….కేటీఆర్ బయట ఉండి హుజూరాబాద్ రాజకీయాన్ని మార్చాలని చూస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నట్లు ఉన్నారు. ఎన్నిక అయ్యాక ఈటల, వివేక్‌లు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతారని మాట్లాడుతున్నారు.

హుజూరాబాద్‌లో ఈటలని గెలిపించడానికి కాంగ్రెస్ నుంచి డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టారని అంటున్నారు. అలాగే టి‌సి‌పి‌సి‌సి అక్రమార్కుల చేతుల్లో ఉందని, ఇక వారి చెప్పినట్లే కాంగ్రెస్‌లో రాజకీయం నడుస్తోందని, కానీ భట్టి విక్రమార్క మంచోడు అని, ఆయన మాట కాంగ్రెస్‌లో చెల్లడం లేదని అన్నారు. అసలు ఈటల, వివేక్‌లపై బురదజల్లి హుజూరాబాద్‌లో రాజకీయంగా బెనిఫిట్ పొందడానికి కేటీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టి, ఆ పార్టీని దెబ్బకొట్టి, భట్టిని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. కానీ ఇవేమీ వర్కౌట్ అవ్వవని కేటీఆర్‌కే అర్ధం కావడం లేదు అనుకుంటా.