హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కేనా..?

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తీసుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక చు్టూనే రాజ‌కీయ పార్టీలు తిరుగుతున్నాయి. ఇక ఇక్క‌డ మొద‌టి నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్ పై ఎన్నో అనుమానాలు వినిపిస్తున్నాయి. చాలామంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చినా కూడా ఎవ‌రినీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. ఇక కౌశిక్ రెడ్డిని నిల‌బెడుతార‌నే ప్ర‌చారం కూడా సాగినా కూడా దానిపై ఇంకా స‌మాచారం లేదు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా మ‌రో కీల‌క అధికారి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయ‌నెవ‌రో కాదు గురుకులాల కార్య‌ద‌ర్శిగా ఎన్నో సేవ‌లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్వేరోస్ అనే సంస్థ స్థాపించిన ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్‌. ఈయ‌న ఈరోజు(సోమ‌వారం) త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. 26 ఏండ్ల పాటు స‌ర్వీస్ చేసిన ఆయ‌న ఎంతోమందికి మేలు చేశారు.

ఇక ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేయించేందుకు కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేసి ఆయ‌న‌తో రాజీనామా చేయించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. హుజూరాబాద్‌లో ఈట‌ల‌ను ఎదుర్కోవాలంటే అంత‌కంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న నేత కావాల‌ని అందుకే ప్ర‌వీణ్ కుమార్ ను దించుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే హుజూరాబాద్‌లో 40శాతం కంటే ఎక్కువ ఎస్సీలు ఉన్నారు. ప్ర‌వీణ్ కుమార్‌ను నిల‌బెడితే వారి ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా టీఆర్ఎస్కే ప‌డుతాయి. అంతేకాదు ఆయ‌న‌కు అన్ని కులాల్లోనూ ఇమేజ్ ఉండ‌టంతో ఆయ‌నే ఇందుకు క‌రెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారంట‌. పైగా స్వేరోస్ సంస్థ ప్ర‌తినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండ‌టంతో వారంతా టీఆర్ ఎస్‌కే స‌పోర్టుగా ఉంటార‌నే భావ‌న‌తోనే ఆయ‌న్నే నిల‌బెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.