గవర్నర్ ప్రసంగంలో కెసిఆర్ వ్యూహం చూస్తే ఔరా అంటారు…!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పౌరసత్వ సవరణ చట్ట౦ విషయ౦ లో ఎంత సీరియస్ గా ఉన్నారో అందరికి తెలిసిందే. రాజకీయంగా బలంగా ఉన్న కెసిఆర్ దీనిని రాష్ట్రంలో అమలు చేసే అవకాశం లేదని అసెంబ్లీ లో తీర్మానం చేస్తా అని స్పష్టంగా చెప్పారు. శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక తీర్మాన౦కి సంబంధించిన అంశం ఉంటుంది అని అందరూ భావించారు.

కాని కెసిఆర్ మాత్రం గవర్నర్ ప్రసంగంలో ఆ విషయం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో కేరళ గవర్నర్ వ్యవహరించిన విధంగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తే దీనిపై బిజెపికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ విషయంలో కొత్త రాద్ధాంతం అవసరం లేదని ఎలాగూ అసెంబ్లీ లో తీర్మానం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రసంగంలో అది అవసరం లేదని కెసిఆర్ భావించారట.

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం పెడతామని చెప్పకుండా… మత సామరస్యానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చారు. ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందేలా లౌకిక స్పూర్తిని కాపాడేలా త్రికరణ శుద్ధిగా పని చేస్తున్నామని గవర్నర్ ద్వారా కెసిఆర్ చెప్పించడం గమనార్హం. ఒకవేళ ఆమె గనుక పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడి ఉంటే అనవసరంగా ఇబ్బంది పడతాం అని భావించారట.

Read more RELATED
Recommended to you

Latest news