ఏపీలో ఇంకా చంద్ర‌బాబు పాల‌నా… ఇదెక్క‌డి చోద్యం..!

-

రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింద‌నే విష‌యం యావ‌త్ ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు తెలిసినా.. ఓ వ‌ర్గం వారికి మాత్రం ఇంకా చంద్ర‌బాబు పాల‌నే కొన‌సాగుతున్న‌ట్టు ఉందా? అంటే.. తాజాగా వారు వ్య‌క్తం చేస్తున్న అభిప్రాయాల‌ను బ‌ట్టి ఔన‌నే అనిపిస్తోంది. నిజానికి ప్ర‌భుత్వం మారిందంటే.. స‌ద‌రు పాల‌కుడు లేదా పాల‌క ప‌క్షం వ్య‌వ‌హార శైలి ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే క‌దా?  అందుకే క‌దా.. ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన పార్టీని గెలిపించి అధికారం అప్ప‌గిస్తారు. మ‌రి ఈ విష‌యాన్ని ఎందుకు స‌ద‌రు వ‌ర్గం గ్ర‌హించ‌లేక‌పోతోంది? అనేది కీల‌కంగా మారింది. రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న మారిపోయి.. జ‌గ‌న్ ప‌రిపాల‌న వ‌చ్చింది.

గ‌తంలో ఐదేళ్లు పాలించిన చంద్ర‌బాబును అనుభ‌వ శూరునిగానే 2014లో ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. అయి తే, ఆయ‌న ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం, ప‌నిక‌న్నా ప్ర‌చారం చేసుకోవ‌డం, త‌మ్ముళ్లు ఏం చేస్తు న్నా.. చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం, ప్ర‌త్యేక హోదా వంటి కీల‌క విష‌యాల్లో యూట‌ర్న్‌లు తీసుకుని ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌డం, కేంద్రంతో పొత్తు త‌ర్వాత విడిపోవ‌డం ఇవ‌న్నీ కూడా ప్ర‌జ‌లు జీర్ణించు కోలేకపోయారు. ఈ క్ర‌మంలోనే బాబును కాద‌ని జ‌గ‌న్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. అంటే.. బాబు చేసిన ప‌నులు న‌చ్చ‌కే క‌దా ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఎన్నుకున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది.

కానీ, చంద్ర‌బాబును పొగిడే వారు.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తిచ్చే ఓవ‌ర్గం మీడియా మాత్రం ఇంకా.. ఈ రాష్ట్రా న్ని చంద్ర‌బాబు పాలిస్తున్నార‌నే భ్ర‌మ‌ల్లో ఉంటున్నాయి. అందుకే రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. కొండంతలు చేస్తున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ రోజువారీ నిర్వహించే సమీక్ష సమావేశాల్లో పద్మం ఆకారంలో కనిపించే చక్రం మాయమైంది. దాని స్థానంలో తెల్లని రంగుపై రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ప్రత్యక్షమైంది. అధికార ముద్ర హఠాత్తుగా తెరపైకి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ ఆకర్షణీయంగా కనిపించిన బ్యాక్‌డ్రాప్‌ ఒక్కసారిగా మారిపోయింది.  అయితే, దీనిని కూడా రాజ‌కీయం చేసేందుకు స‌ద‌రు వర్గం ప్ర‌య‌త్నించింది.

నిజానికి ఇది అప్ప‌టి చంద్ర‌బాబు సెంటిమెంట్ కోసం.. ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు సీఎం దీనిని మార్చుకున్నారు. దీనికి కూడా రాజ‌కీయాలు అంటించి.. చూడాల‌ను కోవ‌డం చర్చ‌కు దారితీసింది. అదేవిధంగా ఆది నుంచి జ‌గ‌న్ తాను చేయాల‌నుకున్న ప‌నిని చేస్తున్నారు. వెళ్లాల‌ని నిర్దేశించిన పేద‌ల‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు అందుతున్నాయి. అయితే, దీనికి ప్ర‌చారం అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ భావ‌న‌. కానీ, బాబు వ‌ర్గం మాత్రం ఈ ప‌నులు చూడ‌డం మానేసి.. ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తోంది. అంటే.. అదే జ‌గ‌న్ తాను చేయాల్సింది మానేసి ప్ర‌చారాల‌కు దిగితే బాగుంటుంద‌ని వీరు భావిస్తున్న‌ట్టుగా ఉంది. మొత్తానికి బాబు లేక‌పోయినా.. అధికారంలో ఉన్న‌ట్టు ఊహ‌ల్లో బ‌తుకుతున్నార‌నే విమ‌ర్శ‌లు మాత్రం వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news