శేరిలింగంపల్లిలో గాంధీకి ఎదురులేదా? బీజేపీకి టీడీపీతో ట్విస్ట్?

-

హైటెక్ సిటీ ప్రాంతం ప్రధానంగా ఉంటూ..సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హవా ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా తయారైంది. ఏపీ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారి హవా ఎక్కువ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గెలుపోటములని వారే డిసైడ్ చేస్తారు. అయితే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ అరికెపూడి గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో గాంధీ గెలిచారు.

అయితే తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో టి‌డి‌పి వీక్ అవుతుండటంతో తప్పనిసరి పరిస్తితుల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి 43 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచారు. ఇక్కడ టీడీపీకి లక్ష ఓట్లు వరకు పడ్డాయి. ఇక నిదానంగా అక్కడ టీడీపీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. అటు కాంగ్రెస్ హవా కూడా కనిపించడం లేదు. ఈ పరిస్తితుల్లో బి‌జే‌పి పికప్ అవుతూ వచ్చింది.

 

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పినే పోటీ ఇస్తుంది. బి‌జే‌పి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. అదే సమయంలో ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తనయుడు కూడా ట్రై చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేరు. అంటే పోటీ బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే ఉంటుంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది..అది ఏంటంటే ఇక్కడ టి‌డి‌పి హవా పెద్దగా లేదు గాని..కొంతమేర ఆ పార్టీకి బలం ఉంది. సపోర్ట్ చేసేవారు ఉన్నారు.

అయితే ఇక్కడ టి‌డి‌పి శ్రేణులు గాంధీ వైపు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే బి‌జే‌పికి కలిసొస్తుంది..లేదంటే మళ్ళీ ఇక్కడ గాంధీని ఆపడం కష్టమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news