కన్నా జంపింగ్‌లో ట్విస్ట్..బీఆర్ఎస్‌లోకి ఎంట్రీ?

-

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా బి‌జే‌పికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు నచ్చక బి‌జే‌పిని వీడుతున్నట్లు కన్నా చెప్పుకొచ్చారు. అయితే బీజేపీని వీడిన కన్నా..ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనేది పెద్ద ట్విస్ట్ గా మారింది. ఈయన టి‌డి‌పిలో చేరతారని ప్రచారం ఎక్కువ వస్తుంది. అదే సమయంలో పొత్తు ఉంటే జనసేనలో చేరి సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ లో పోటీ చేస్తారని ప్రచారం కూడా వస్తుంది. ఇప్పటివరకు కన్నా టి‌డి‌పి లేదా జనసేన లో చేరతారని ప్రచారం మాత్రమే వచ్చింది.

కానీ తాజాగా కొత్త ట్విస్ట్ ఇస్తూ కన్నా..కేసీఆర్ బీఆర్ఎస్ లో చేరతారని టాక్ మొదలైంది. ఇదే క్రమంలో ఏపీ బి‌ఆర్‌ఎస్ నేత రావెల కిషోర్ బాబు..కన్నాని బి‌ఆర్‌ఎస్ లోకి ఆహ్వానించారు. అయితే రావెల సైతం బి‌జే‌పి నుంచి బయటకొచ్చి బి‌ఆర్‌ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. సోము వైఖరి నచ్చకే రావెల సైతం బి‌జే‌పిని వీడారు. కానీ ఆయన అనూహ్యంగా బి‌ఆర్‌ఎస్ లో చేరారు. ఇప్పుడు కన్నాని..బి‌ఆర్‌ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఇక ఏ పార్టీలో చేరాలనేది కన్నా డెసిషన్.

ఏపీలో బి‌ఆర్‌ఎస్ పార్టీ నిర్మాణం జరగలేదు. అలాంటప్పుడు ఆ పార్టీలోకి వెళ్తారనేది డౌటే. అదే సమయంలో ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం వస్తుంది. గతంలో కూడా వైసీపీలోకి వెళ్ళాల్సింది..కానీ కేంద్రం పెద్దలు బి‌జే‌పిలో చేరేలా చేశారు. అయితే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కన్నా..వైసీపీలో చేరడం కష్టమనే చెప్పాలి.

మొత్తానికి చూసుకుంటే కన్నా దాదాపు టి‌డి‌పిలో చేరే అవకాశం ఉంది అది కాదు అనుకుంటే జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బి‌ఆర్‌ఎస్, వైసీపీలోకి వెళ్ళడం డౌటే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news