స్పీకర్ సెంటిమెంట్‌ని పోచారం బ్రేక్ చేస్తారా.?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది..అది ఏంటంటే ఎవరైతే స్పీకర్‌గా పనిచేస్తారో..వారు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని. ఉమ్మడి ఏపీలో ఈ సెంటిమెంట్ బాగానే నడిచింది. ఇక రెండు రాష్ట్రాలు విడిపోయాక కూడా సెంటిమెంట్ నడుస్తూనే ఉంది. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగా స్పీకర్ గా మధుసూదనచారి పనిచేశారు. అటు ఏపీలో టి‌డి‌పి అధికారంలోకి రాగా స్పీకర్ గా కోడెల శివప్రసాద్ పనిచేశారు.

అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనచారి ఓటమి పాలయ్యారు. భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అటు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018లో తెలంగాణలో మళ్ళీ బి‌ఆర్‌ఎస్ గెలవగా స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి పనిచేస్తున్నారు. అటు ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అక్కడ స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు. అయితే స్పీకర్ సెంటిమెంట్ తమ్మినేనికి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో తమ్మినేని గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

Pocharam Srinivas Reddy (@PSRTRS) / Twitter

తమ్మినేని విషయం పక్కన పెడితే.తెలంగాణ స్పీకర్ పోచారం పరిస్తితి ఎలా ఉందంటే..ఈయనకు ప్రస్తుతానికి ఇబ్బంది లేదని తెలుస్తోంది. బాన్సువాడలో పోచారంకు నెగిటివ్ పెద్దగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పోచారం..టి‌డి‌పి తరుపున 1994, 1999 ఎన్నికల్లో బాన్సువాడ నుంచి గెలిచారు.

2004లో ఓడిపోగా, 2009లో మళ్ళీ గెలిచారు. టి‌డి‌పికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. 2011 ఉపఎన్నికలో మళ్ళీ గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఇలా వరుస విజయాలతో సత్తా చాటిన పోచారం..ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు. ప్రస్తుతం బాన్సువాడలో పోచారంకి రిస్క్ లేదు. అటు కాంగ్రెస్, ఇటు బి‌జే‌పిలు బలంగా కనిపించడం లేదు. కాబట్టి స్పీకర్ సెంటిమెంట్‌ని పోచారం బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news