వైసీపీ లో ఏదో జరుగుతోంది ? జగన్ భయమూ అదే ?

-

వైసీపీలో అంతా నిశ్శబ్ద వాతావరణం ఉన్నట్టుగానే కనిపిస్తున్నా, లోలోపల మాత్రం ఏదో జరిగిపోతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అలుపెరగకుండా, ప్రజాసంక్షేమం కోసం ఆ పార్టీ అధినేత సీఎం జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, పార్టీని ముందుకు తీసుకు వెళ్లే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగాలి అని మరో 30 ఏళ్ళు సీఎం గా ఉండాలనే నినాదాన్ని ప్రజల నుంచి తీసుకురావాలనేది జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది. దీనికోసం ఆయన అహర్నిశలు కృషి సొంత పార్టీ నేతలు అర్థం చేసుకున్నట్టుగానే వ్యవహరిస్తుండడంతో, జగన్ కు ఆగ్రహం కలిగిస్తోందట. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరి దారి వారిదే అన్నట్లు గా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ కు ఈ వ్యవహారాలు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

CM JAGAN
CM JAGAN

ఇదే విషయమై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కు వార్నింగ్ ఇస్తున్నా, పరిస్థితిలో మార్పు రాకపోవడం, వారి కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినడం వంటివి చాలా కాలంగా జరుగుతూనే వస్తున్నాయి. నువ్వు వైపు చూస్తే ప్రభుత్వంలోని లోపాలను హైలెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న హడావుడి వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను ఏ విధంగా ఉండడం, టిడిపి విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో చేస్తున్న విమర్శలు సొంత నుంచి పార్టీకి చెడ్డపేరు తీసుకొ చ్చెలా తయారవడం, మరికొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతున్న వారికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తున్నా, పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఇలా ఎన్నో అంశాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం జగన్ పరిపాలన పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో, పార్టీలో ఏం జరుగుతుందనే విషయంపై పూర్తిగా దృష్టి సారించ లేకపోతున్నారు.

ఇదే అదనుగా ఇష్టానుసారంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది జగన్ అభిప్రాయం. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ అభీష్టం మేరకు నడుచుకుంటూ, ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికివారు తమ తమ నియోజకవర్గాల్లో వేరొకరి జోక్యం లేకుండా చూసుకునే క్రమంలో ఎంపీలతో వివాదాలకు దిగుతూ ఉండడం వంటివి ఎన్నో వైసీపీలో చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోటా ఇదే తంతు నెలకొంది. పార్టీలో నాయకుల మధ్య తలెత్తిన ఈ అసంతృప్తి ఎక్కడకి దారితీస్తుందో అనే టెన్షన్ పార్టీలో నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news