రాజధాని విషయంలో జగన్ డ్రాప్…? కారణం ఏంటీ…?

-

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కు తగ్గారా…? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. దాదాపు రెండు వారాల క్రితం జగన్ మూడు రాజధానులు అంటూ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు జగన్ ప్రకటించారు. ఆ తర్వాత ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. అటు విశాఖలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగా బలంగా ఉన్న జగన్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు కూడా అడ్డు పడ్డారని ప్రచారం జరిగింది.

ఆ తర్వాత కేంద్రం కూడా రంగంలోకి దిగింది అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇక్కడ హిందుత్వ సంస్థ ఎంట్రీతో పరిస్థితి మారిందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. చక్రపాణి మహారాజ్ సహా కొందరు హిందుత్వ సంస్థల ప్రతినిధులు జగన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, అయోధ్య నుంచి 20 వేల మందితో ర్యాలీగా అయోధ్య టూ అమరావతి వస్తామని ప్రకటించారు. ఆ తర్వాత చక్రపాణి మహారాజ్ వెళ్లి అమిత్ షా తో భేటి కావడం జరిగింది. ఆ వెంటనే సంఘ్ పరివార్ కూడా ఈ విషయంలో దృష్టి సారించింది.

విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసాయి. అమరావతి అనేది హిందువులు పవిత్రంగా భావించే స్థలాల్లో ఒకటిగా ఉంది. అక్కడి నుంచి రాజధాని తరలిస్తే తమకు దెబ్బని, సెంట్రల్ ఆంధ్రాలో బలపడే అవకాశం కోల్పోతామని బిజెపి కూడా భావించింది. అందుకే జగన్ నిర్ణయానికి అడ్డుపడినట్టు సమాచారం. ఉత్తరాంధ్రకు సింహభాగం ఇస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందనే సంకేతాలు కూడా బిజెపి ఇచ్చింది. దీనితో జగన్ వెనక్కు తగ్గారని, విశాఖలో గాని, కేబినేట్ సమావేశంలో గాని మాట్లడకపోవడానికి అదే కారణమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news