బాబు అరెస్ట్‌పై జగన్ ఫోకస్..ఢిల్లీలో ఏం జరగనుంది?

-

ఏపీ సి‌ఎం జగన్ లండన్ పర్యటనలో ఉండగానే..ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రానికి వచ్చిన జగన్..వెంటనే బాబు అరెస్ట్ పై వైసీపీ కీలక నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది.  సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఎఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిఈ సమావేశంలో ఉన్నట్లు తెలిసింది.  టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

అయితే జగన్..ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు తెలిసింది. ఈ నెల 13న జగన్ ఢిల్లీ టూర్ ఖాయమైందని సమాచారం. ప్రధాని మోదీ, అమిత్ షాలని జగన్ కలుస్తారని తెలుస్తోంది. ఇక దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇక బాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్ళడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇప్పటికే బాబుని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. పైగా ఢిల్లీ పెద్దల సహకారంతోనే జగన్..బాబుని అరెస్ట్ చేయించారని చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్ళి..ఢిల్లీ పెద్దలని కలిస్తే అప్పుడు రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారిపోతాయని చెప్పవచ్చు. ఢిల్లీకి వెళ్ళి జగన్ ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశంగా మారింది. పైకి రాష్ట్ర సమస్యలపై మాట్లాడమని వైసీపీ నేతలు చెబుతారు గాని..అంతర్గతంగా జరిగే చర్చలు వేరు అని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

ఇక జగన్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఇంకా పూర్తిగా వాడివేడిగా సాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news