ఒక ఆడపిల్ల ని అద్భుతంగా కాపాడిన జగన్ మోహన్ రెడ్డి ఐడియా !!

-

తొమ్మిది నెలల పరిపాలనలో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఐడియాలు చాలా హైలైట్ అయ్యాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా జగన్ ఐడియాలను తమ రాష్ట్రాలలో అమలు చేయడానికి ఇటీవల ముందుకు రావడం జరిగింది. రివర్స్ టెండరింగ్, ఇంటి వద్దకే పెన్షన్ వంటి కార్యక్రమాలతో ఎంతో పాపులర్ అయిన జగన్ దిశ చట్టం ద్వారా మరింతగా దేశంలో ఉన్న ప్రముఖ నాయకులనే ప్రభావితం చేసే నాయకుడిగా అవతరించారు. దేశంలోని చాలా రాష్ట్రాలలో ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్న పెద్దగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. Image result for disha appఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ ఘటనపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లకు రాకూడదని దిశ చట్టం తీసుకురావటం జరిగింది. అయితే ఈ చట్టం లో కొన్ని లొసుగులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. అయితే చట్టం ఇంకా అమలు కాకముందే జగన్ ఐడియా, దిశ యాప్ ద్వారా చాలామంది ఆడపిల్లలు సమాజంలో మగాళ్ల రూపంలో ఉన్న మృగాళ్ల బారిన పడకుండా సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నారు.

 

తాజాగా ఈ ఐడియా వల్ల ఒక ఆడపిల్లని అద్భుతంగా జగన్ కాపాడటం జరిగింది. విషయంలోకి వెళితే కొల్లేటి కోట లో ఒక మహిళ ని ట్రాప్ చేయబోయాడు ఆటో డ్రైవర్. అయితే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి కిడ్నాప్ చేయాలనీ భావించినట్లు తెలుస్తుంది. అయితే అనుమానం వచ్చిన మహిళ దిశ యాప్ సహాయంతో తప్పించుకుంది. ఆటో డ్రైవర్ తీరు ని గమనించిన సదరు మహిళ, అప్రమత్తమై sos ద్వారా సమాచారం అందజేశారు. అయితే ఘటన స్థలానికి ఎనిమిది నిమిషాల్లో పోలీసులు చేరుకొని మహిళని కాపాడి, ఆ ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసారు. అసలు ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడటం జరిగిందో అన్ని విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news