జగన్ వన్ మ్యాన్ షో..ప్రత్యర్ధులకు చెక్.!

-

జగన్: ఏపీ రాజకీయాల్లో జగన్ వన్ మ్యాన్ షో నడుస్తుంది..గత ఎన్నికల నుంచి ఆయన హవా పూర్తిగా ఉంది. ప్రత్యర్ధులు ఎన్ని వ్యూహాలు పన్నిన..గత ఎన్నికల్లో ప్రజా మద్ధతుతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి..ఆ ప్రజలకు న్యాయం చేసేలా జగన్ పాలన చేస్తూ ముందుకెళుతున్నారు. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతూ ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు. అయితే ఇలా డబ్బులు ఇస్తూ ప్రజలకు అండగా ఉంటున్న జగన్..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు బటన్ నొక్కి ప్రజలకు అండగా ఉంటున్నారు కాబట్టి..ఆ ప్రజలే తనకు అండగా ఉంటారని భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలవడం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఈసారి జగన్‌ని ఓడించడానికి ప్రత్యర్ధులు ఏకమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలిసిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తులో పోటీ చేయనున్నాయి. ఇక వీరితో బి‌జే‌పి కలుస్తుందా..లేక కమ్యూనిస్టులు కలుస్తారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి జగన్‌ని ఓడించడానికి ప్రత్యర్ధులు మాత్రం కలుస్తున్నారు. కానీ జగన్ సింగిల్ గా ముందుకెళుతున్నారు.

ఈ సారి ఎన్నికల్లో కూడా వన్ మ్యాన్ షో నడిచేలా పనిచేస్తున్నారు. అయితే ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు కనిపిస్తుంది. తమ కోసం జగన్ బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారని, మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే పథకాలు రావని భావిస్తున్నారు. పైగా జగన్ ఒక్కడిని చేసి ఓడించడానికి పొత్తులు పెట్టుకుంటున్నారని, కాబట్టి జగన్‌కు అండగా ఉండాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు.

రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల మద్ధతు జగన్‌కే ఎక్కువ ఉందని చెప్పవచ్చు. అయితే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే ప్రజలు పట్టించుకునే పరిస్తితి లేదు. జగన్‌ని చూసే జనం ఓట్లు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ సారి కూడా జగన్ వన్ మ్యాన్ షో నడవటం ఖాయం..ప్రత్యర్ధులకు చెక్ పెట్టి గెలవడం ఖాయమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news