ఏపీ రాజకీయాల్లో ఇంతవరకు ఏ నాయకుడు కూడా అమలు చేయని విధంగా జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రత్యర్ధులకు తెలియనివ్వకుండా వ్యూహాలు అమలు చేస్తూ..వారికి చెక్ పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో అలాగే చేసి టిడిపిని చిత్తు చేశారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే తరహాలో జగన్ ముందుకెళుతున్నారు. ఎక్కడకకడ టిడిపిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నారు..సంక్షేమ పథకాలు ఆయనకు ప్రధాన బలంగా ఉన్నాయి. అటు లబ్దిదారులు జగన్ కు సపోర్ట్ గా ఉన్నారు. కేవలం పథకాలు అందేవారి ఓట్లు పడిన చాలు జగన్ మళ్ళీ గెలిచేస్తారు..సిఎం అవుతారు. ఇప్పుడు వారి ఓట్లు పూర్తి స్థాయిలో పడేలా చేసుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు. ఇక ఊహకందని విధంగా చంద్రబాబు, పవన్ లకు చెక్ పెట్టేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. బాబు-పవన్ కలిస్తే కాపు ఓట్లు వన్ సైడ్ గా పడతాయనేది అందరూ భావిస్తున్నారు.
కానీ అలా కాపు ఓట్లు వన్ సైడ్ గా వెళ్లకుండా జగన్ రాజకీయంగా టిడిపి, జనసేనలకు చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. టిడిపి, జనసేన పొత్తు ఉంటే..ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఉంటాయి. ఎవరికెన్ని సీట్లు దక్కుతాయో తెలియదు గాని..పొత్తులో పోటీ చేసినప్పుడు ఒక పార్టీ ఓట్లు మరొక పార్టీ బదిలీ అవ్వడం అనేది పెద్ద ప్రక్రియ.
ఈ క్రమంలో ఆ ఓట్ల బదిలీని అడ్డుకుని పొత్తుకు చెక్ పెట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకు టిడిపి ఎక్కువ సీట్లలో బరిలో ఉంటుంది…ఆ పార్టీకి జనసేన ఓట్లు బదిలీ కావాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మొదట నుంచి కాపులు టిడిపికి యాంటీ..అలాంటప్పుడు వారు టిడిపికి ఓట్లు వేయడం అనేది కష్టం. అందుకే వారి ఓట్లు బదిలీ కాకుండా వైసీపీకి వేయించుకునేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పక్కా వ్యూహాలు అమలు చేసి..కాపుల ఓట్లు పూర్తిగా టిడిపి, జనసేనకు వెళ్లనివ్వకుండా..కొన్ని ఓట్లు వైసీపీకి పడేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.