ప‌విత్ర య‌జ్ఞం చేస్తున్నాం..ఆద‌రించండి

-

– మూడో విడత అమ్మ ఒడికి శ్రీ‌కారం
– ప‌థ‌కం వ‌ర్తింపునకు
75 శాతం హాజ‌రు త‌ప్ప‌ని స‌రి
– శ్రీ‌కాకుళం వాకిట సీఎం
– చ‌దువుల‌పై పెట్టుబడులు అన్న‌వి
స‌మాజం త‌ల రాత‌ను మార్చేవే
– విప‌క్షాల విమ‌ర్శలు న‌మ్మొద్దు
– విష ప్ర‌చారం తిప్పి కొట్టండి
– అతి కొద్ది మందికి మాత్ర‌మే
అంద‌ని అమ్మ ఒడి
– మంత్రులు బొత్స మ‌రియు ధ‌ర్మాన
– ఈ ఏడాది డిసెంబ‌ర్ కు వంశ‌ధార ప్రాజెక్టు ఫేజ్ 2 పూర్తి
– గొట్టా బ్యారేజీ వ‌ద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి నిధులు మంజూరు చేసి
జిల్లాకు వ‌రాలు అందించిన సీఎం

శ్రీ‌కాకుళం న‌గ‌రం : ప‌విత్ర య‌జ్ఞం చేస్తున్నాం ఆద‌రించండి అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో సోమ‌వారం నిర్వ‌హించిన మూడో విడ‌త అమ్మ ఒడి ప‌థ‌కానికి సంబంధించి నిధులు విడుద‌ల చేసే కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసి, సంబంధిత స‌భ‌లో ప్ర‌సంగించారు. ముఖ్యంగా గ‌త ప్ర‌భుత్వం ఉంచిన బ‌కాయిల‌ను తీరుస్తూ, నాటి ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేరుస్తూ, మ్యానిఫెస్టోను అమ‌లు పరుస్తూ పాల‌న చేస్తున్నామ‌ని అన్నారు. అదేవిధంగా జిల్లాకు కీల‌కంగా ఉన్న ప్రాజెక్టుల‌కు నిధులు విడుద‌ల చేసి స‌భికుల హ‌ర్ష‌ద్వానాలు అందుకున్నారు. స‌భ‌లో శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌కు చెందిన నిహారిక ఇంగ్లీషులో మాట్లాడి ఆక‌ట్టుకుని, సీఎం దీవెన‌లు అందుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే..

43,96,402 మంది తల్లుల‌కు, వారి 80 ల‌క్షల మంంది కి పైగా పిల్ల‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే విధంగా అమ్మ ఒడి ఆరు వేల కోట్ల 595 రూపాయ‌ల‌కు పైగా నిధులు జ‌మ చేస్తున్నాం. ఆడ‌బిడ్డ‌ల‌కు తోడుగా ఓ అన్న‌య్య తోడుగా ఉన్నాడ‌ని చెప్పే కార్య‌క్ర‌మం.. ఇది. ఒక మ‌నిషి త‌ల‌రాత‌ను మార్చ‌గ‌లిగే శ‌క్తి చ‌దువుకు మాత్ర‌మే ఉంది..మ‌న మ‌నిషి బ‌తుకు మార్చ‌గ‌లిగే శ‌క్తి చ‌దువుకే ఉంది..ఒక స‌మాజం త‌ల రాత‌ను ఒక‌దేశం త‌ల‌రాను మార్చ‌గ‌లిగే శ‌క్తి ఉండేది చ‌దువుకే ! ఉంది. చ‌దువులు బాగా ఉన్న దేశాల‌లో ఆదాయాలు ఎక్కువే ! మ‌న క‌న్నా త‌ల‌స‌రి ఆదాయం ఎక్కువే !చ‌దువుకు ఆ శ‌క్తి ఉంది క‌నుక వాళ్ల‌కు మ‌న‌కూ తేడా క‌నిపిస్తూ ఉంది. చ‌దువే నిజం అయిన ఆస్తి.. ఈ ప్ర‌భుత్వం చ‌దువుపై పెట్టే ప్ర‌తి పైసా కూడా ఓ ప‌విత్ర‌మైన పెట్టుబ‌డి ..ఒక త‌రాన్నీ వారి త‌ల‌రాత‌ల్నీ కూడా మార్చ గ‌లిగే శ‌క్తి కూడా చ‌దువుల‌కే ఉంది. ప్ర‌పంచంలో ఎక్క‌డికి అయినా బ‌త‌క గ‌లిగే శ‌క్తి చ‌దువుల వ‌ల్లే వ‌స్తుంది. అలాంటి క్వాలిటీ చ‌దువులు అందాల‌న్న త‌ప‌న‌తో గ‌త మూడేళ్లుగా విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకు వ‌చ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాల‌కు భిన్నంగా మన రాష్ట్రం మంచి చ‌దువులు అందించడం అన్న‌ది ఓ హక్కు గా ఓ బాధ్య‌త‌గా తీసుకుని ఈ ప్ర‌భుత్వం అందిస్తూ ఉంది.. పిల్ల‌ల‌ను బ‌డికి పంపిస్తున్న ప్ర‌తి నిరుపేద త‌ల్లుల‌కు జగ‌న‌న్న అమ్మ ఒడి ద్వారా నేరుగా అందుతుంది.. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ చ‌దివే పిల్ల‌ల‌కు ఆర్థిక సాయం అంద‌నుంది. 6595 కోట్లు అందించ‌నున్నాం.

ఈ మూడేళ్ల‌లో 19618 కోట్ల రూపాయ‌లు నేరుగా త‌ల్లుల ఖాతాల్లోకి జ‌మ చేయ‌గ‌లిగాం. ఏ త‌ల్లి అయినా కూడా త‌మ బిడ్డ‌ల‌ను బాగా చ‌దివించాల‌నే భావిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా చ‌దివించ‌లేక‌పోవ‌డం జ‌ర‌గ‌కూడ‌దు.. నా పాద‌యాత్రలో ప్ర‌తి త‌ల్లి ప్ర‌తి చెల్లి కీ నేను ఉన్నాను అని చెప్పాను. చెప్పిన ఆ మాట‌ను నిల‌బెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల‌లో మూడో సారి కూడా ఈ ప‌థకం కింద నిధులు ఇస్తున్నాం. ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం పాఠ‌శాలలో అయినా, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో చ‌దివించినా అభ్యంత‌రం లేదు. ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం అందించే గొప్ప కార్య‌క్ర‌మం అమ్మ ఒడి.. ఎంత మంది ఎక్కువ పిల్ల‌లు చ‌దువుకుంటే అంత ఆనందం..ఎంత మంది త‌ల్లుల‌కు ఈ ప‌థ‌కం అందితే అంత ఆనందం.

క‌నీస హాజ‌రు శాతం 75 శాతం ఉండాల‌ని చెప్పాం. అంటే బ డి నాలుగు రోజులు జ‌రిగితే మూడు రోజులు అయినా జరిగితేనే ఈ ప‌థ‌కం వ‌ర్తింపు చేస్తామని చెప్ప‌డం జ‌రిగింది. ఎందుకంటే పిల్ల‌ల‌ను ఓ త‌పస్సులా చ‌దివిస్తేనే త‌ల రాత‌లు మారుతాయి. అందుకే ఈ నిబంధ‌న. తొలి సారి అమ్మ ఒడి ప‌థకం అమ‌లులో ఈ నిబంధ‌న లేదు. త‌రువాత ఏడాది అనుకోకుండా కోవిడ్ రావ‌డంతో ఈ నిబంధ‌న‌ను హాజ‌రు శాతం మిన‌హాయింపు ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. గ‌త సెప్టెంబ‌ర్ నుంచి పాఠ‌శాల‌లు య‌థావిధిగా న‌డుస్తున్నాయి. క‌నీసం 75 శాతం హాజ‌రు ఉండాల‌న్న నిబంధ‌న‌తో 1.14 శాతం త‌ల్లుల‌కు అమ్మ ఒడి ఇవ్వ‌లేక‌పోయాం. ప‌థ‌కం అమ‌ల్లో భాగంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నిమిత్తం ఒక్కో ల‌బ్ధిదారుకు ఇచ్చే మొత్తంలో వెయ్యి రూపాయ‌లు కేటాయింపు చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ మెయింటెనెన్స్ లో భాగంగా మ‌రో వెయ్యి రూపాయ‌లు ల‌బ్ధిదారుల‌కు అందించే మొత్తం నుంచి మిన‌హాయింపు చేస్తున్నాం. నాడు నేడు లో భాగంగా బ‌డులు బాగు ప‌డినందున అవి రేప‌టి వేళ కూడా ఉండాల‌న్నా, అదేవిధంగా చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తులు ఏమ‌యినా చేయించాలంటే నిధుల కేటాయింపు చేసే విధంగా ఈ ఫండును ఉప‌యోగించే విధంగా పేరెంట్స్ క‌మిటీ వెచ్చిస్తారు.

ఈ నిధుల‌ను టాయిలెట్ మెయింటైనెన్స్ కోసం అదేవిధంగా పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌ధానోపాధ్యాయుడి అనుమ‌తితో ఈ నిధులు వెచ్చింపు చేస్తారు. ఈ విధంగా చేస్తే త‌ల్లుల‌లో బాధ్య‌త ఉంటుంది. అదేవిధంగా బ‌డి బాగుండ‌క‌పోతే అడిగే హ‌క్కు వ‌స్తుంది. అందుకే ఈ రెండు కార్య‌క్ర‌మాలు రూపొందింప జేస్తున్నాం. ఈ రెండు వేల రూపాయ‌ల మిన‌హాయింపుపై విమ‌ర్శ‌లు కూడా కొంద‌రు చేస్తున్నారు.. ఇదే ఆశ్చ‌ర్య‌క‌రం. అయినా ఈ మాట‌లు చెబుతున్న వారు వారి జీవితంలో ఏనాడ‌యినా అమ్మ ఒడి లాంటి ప‌థ‌కాన్ని ఏనాడ‌యినా ఇచ్చారా అని అడుగుతున్నాను. మ్యానిఫెస్టోను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తూ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నాం. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఆన్లైన్ పాఠాలు అందించే ఉద్దేశంతో బైజూస్-తో ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా ఎనిమిదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లతో ట్యాబ్ లు అందిస్తున్నాం.

బైజూస్ యాప్ ద్వారా నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మ‌రింత సుల‌భంగా మ‌రింత అర్థ‌వంతం అయ్యే విధంగా
విజువ‌ల్ కంటెంట్ రూపొందుతుంది. సీబీఎస్సీఈ సిల‌బ‌స్ తో బై లింగ్విల్ ప్రాట్య‌న్ లో పాఠ్య పుస్త‌కాలు అందించ‌నున్నాం. ఎనిమిదో త‌ర‌గ‌తి లో అడుగుపెట్టబోయే విద్యార్థికి సెప్టెంబ‌ర్ నుంచి 12 వేలు రూపాయ‌లు విలువ చేసే ట్యాబ్ అందించ‌నున్నాం.
ఇక‌పై ఎనిమిదో త‌ర‌గ‌తిలో అడుగుపెట్ట‌బోయే విద్యార్థికి ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌గా, ఒక నిరంత‌ర కానుక‌గా విద్యా కానుక‌తో పాటు 12 వేలు విలువ చేసే ట్యాబ్ కూడా అంద‌జేస్తాం.. అదేవిధంగా పిల్ల‌ల జీవితాల‌ను మార్చే విధంగా ప్ర‌తి క్లాస్ రూంలో టీవీని అదేవిధంగా డిజిట‌ల్ మోడ్ లో క్లాస్ రూం ను మార్చేవిధంగా కార్యక్ర‌మానికి శ్రీ‌కారం దిద్ద‌నున్నాం. మ‌న పిల్ల‌లు పోటీ ప్ర‌పంచంలో నెగ్గాలి.. అదేవిధంగా పేద‌రికం నుంచి వాళ్లు బ‌య‌ట‌ప‌డి విజేత‌లు కావాలి. అందుకోసం నేను మీకు తోడుగా ఓ అన్న మాదిరిగా ఉంటాను. విద్యా దీవెన, వ‌సతి దీవెన ప‌థ‌కాల‌నూ వ‌ర్తింప జేస్తున్నాం. మూడేళ్ల‌లో 11 వేల కోట్ల రూపాయ‌లు ఇందుకోసం వెచ్చించాం. గ‌తంలో ఇలా ఉండేది కాదు. గ‌త ప్ర‌భుత్వం పెట్టిన 17 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిల‌ను తీర్చాం. విద్యా కానుక ద్వారా
మంచి నాణ్య‌త‌తో కూడిన బ్యాగులు, యూనిఫాంలో, బైలింగ్విల్ టెక్స్టు బుక్సు, నోటుబుక్సు,బూట్లు అందించి, ఇందుకోసం రూ. 2324 కోట్లు వెచ్చింపు.. చేశాం.. జ‌గ‌నన్న గోరు ముద్ద ద్వారా 43 ల‌క్షల మందికి మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం వ‌ర్తింపు. గ‌త ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన ఎనిమిది నెల‌ల బ‌కాయిలు కూడా మేం అధికారంలోకి వ‌చ్చాక తీర్చాం.

అదేవిధంగా నాడు నేడుతో ప్రభుత్వ బ‌డుల రూపు రేఖ‌లు మారిపోయాయి.రెండో ద‌శ‌లో ఎనిమిది వేల కోట్ల‌తో నాడు నేడు చేప‌ట్ట‌నున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ ద్వారా పౌష్టికాహారం పంపిణీ.. మొత్తంగా విద్యా రంగ ప‌థ‌కాల‌కు 52 వేల ఆరువంద‌ల కోట్ల రూపాయ‌లు..వెచ్చించాం. అప్ప‌ట్లో ప్ర‌భుత్వ బ‌డుల‌లో 37 ల క్ష‌ల మంది పైగా ఉండేవారు అదే మేం అధికారంలోకి వ‌చ్చాక గత విద్యా సంవ‌త్సరానికి ఏడు ల‌క్ష‌ల ప‌ది వేల మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు విద్యా సంస్థ‌ల‌లో విద్యార్థుల సంఖ్య 2018 – 19 క‌న్నా 2020 – 21లోనే అనూహ్యంగా ఎక్కువ‌గా ఉంది. అయినా కూడా విష ప్రచార‌మే ! ఇంత మంచి చేస్తున్నా మారీచుల‌తో యుద్ధం చేస్తున్నాం. దుష్ట చ‌తుష్ట‌యంతో యుద్ధం చేస్తున్నాం. వీరందరితో పాటు ఓ ద‌త్త‌పుత్రుడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం. నాకు మీపై నమ్మ‌కం ఉంది.. నాకు ఏ ప్ర‌ధాన మీడియా తోడుగా లేక‌పోయినా మీ తోడు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

శ్రీ‌కాకుళం జిల్లాకు వ‌రాలు

– శ్రీ‌కాకుళంలో కోడిరామ్మూర్తి స్టేడియం పనులకు ప‌ది కోట్ల రూపాయ‌లు మంజూరు
– ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ 69 కోట్ల రూపాయ‌లు అద‌నంగా మంజూరు
– శ్రీ‌కాకుళం – ఆమ‌దాల‌వ‌ల‌స రోడ్డుకు రూ.40 కోట్లు ఇచ్చాం..
ల్యాండ్ ఎక్విజిషేన్ .. ఇతర ప‌నులు కోసం 18 కోట్లు మంజూరు
– వంశ‌ధార నీరు ఎత్తి పోసేందుకు గొట్టా బ్యారేజ్ వ‌ద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ కు రూ.129 కోట్లు
– టెక్క‌లి ఆఫ్ షోర్ కు 855 కోట్లు మంజూరు
– వంశ‌ధార ఫేజ్ 2 ప‌నులు జ‌రుగుతున్నాయి..
– స‌వ‌రించిన అంచనాల ప్ర‌కారం రూ. 2407 కోట్లు..మంజూరు
– ఈ ఏడాది డిసెంబ‌ర్-కు ప్రాజెక్టు పూర్తి
– ఉద్దానం ప్రాంతంలో వంశ‌ధార నీరు అందించేందుకు రూ.700కోట్ల‌తో ప‌నులు జ‌రుగుతున్నాయి. 70 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. ఆ ప్రాజెక్టుకు, ఇచ్ఛాపురం, ప‌లాస, పాత‌ప‌ట్నంలో మూడు మండ‌లాల‌కు రెండు వంద‌ల 50 కోట్ల‌కు పైగా నిధులు.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో పైప్ లైన్ ద్వారా వంశ‌ధార అందించేందుకు ప‌నుల‌కు నిధులు మంజూరు చేస్తూ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న.

Read more RELATED
Recommended to you

Latest news