వాట్సాప్​లోనూ ట్రూ కాలర్.. త్వరలోనే అందుబాటులోకి

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్​లో రోజుకో కొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. ఇతర మెసేజింగ్ యాప్స్​లో కంటే వాట్సాప్​ను నంబర్ వన్ ప్లేస్​లో ఉంచేందుకు ఈ యాప్ నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉంచేందుకు తరచూ వివిధ రకాల ఈజీ ఫీచర్స్​ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా యూజర్ డేటా సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందులో భాగంగా వాట్సాప్ త్వరలోనే ఓ న్యూ ఫీచర్​ను అందుబాటులోకి రానుంది. అదే ట్రూ కాలర్ ఫీచర్.

వాట్సాప్​లోనూ స్పామ్ కాల్స్​ను గుర్తించేందుకు ట్రూ కాలర్​ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ మమెది తెలిపారు. గత రెండు వారాలుగా భారత్‌లో వాట్సాప్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌ వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు. అందుకే, మెసేజింగ్‌ యాప్‌లలోనూ తమ సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు చెప్పా రు. 2021లో ట్రూకాలర్‌ సంస్థ రూపొందించిన ఒక నివేదిక ప్రకారం భారత్‌లో సగటున ఒక్కొక్కరికి నెలకు 17 స్పామ్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఏఐ ఉపయోగించి స్పామ్‌ కాల్స్‌ను నివారించాలని కేంద్రం టెలికం కంపెనీలకు సూచించింది.